ETV Bharat / sitara

థియేటర్లు క్రికెట్ స్టేడియాల్లా మారిన ఆ క్షణాలు - సుశాంత్ ధోనీ వార్తలు

సుశాంత్ సింగ్ నటించిన 'ధోని' సినిమాకు నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలు.

'MS Dhoni The Untold Story' cinema completes 4 years
ధోనీ సినిమా
author img

By

Published : Sep 30, 2020, 5:19 PM IST

సరిగ్గా నాలుగేళ్ల క్రితం. 2016 సెప్టెంబరు 30. మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్.. 'ధోని: ఏ అన్​టోల్డ్ స్టోరీ' విడుదల. -ఆ ఏముంది! ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాం. అతడి గురించి మాకు తెలియదా ఏంటి? అని అనుకుంటూనే థియేటర్​లోకి మహీ అభిమానులు అడుగుపెట్టారు. కొన్ని నిమిషాలకే సినిమాలో లీనమైపోయారు. మేం చూస్తుంది ధోనీనే కదా అని చాలా సన్నివేశాల్లో భ్రమపడ్డారు. ఈ క్రమంలోనే ధోనీ ధోనీ అంటూ అరిచి గోలచేసి, థియేటర్​ను క్రికెట్ స్టేడియాలుగా మార్చేశారు. ఎన్ని అంశాలు ఉన్నా సరే ఇంతలా ఆ చిత్రం ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం టైటిల్ రోల్​ పోషించిన సుశాంత్ సింగ్ రాజ్​పుత్.

dhoni movie stills
ధోనీ సినిమా స్టిల్స్

150 రోజుల కఠోర శిక్షణ

తను ఓ సాధారణ నటుడైనా సరే, పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు. దాదాపు 150 రోజుల పాటు క్రికెట్ ప్రాక్టీసు చేశాడు. ఈ సమయంలోనే గాయలు కూడా అయ్యాయి. అయినా సరే ఎక్కడా తగ్గకుండా ధోనీ హవభావాల్ని, చిన్న చిన్న కదలికల్ని కూడా పట్టేశాడు. అటు సినిమా, ఇటు క్రికెట్​ వీక్షకుల చేత ఒకేసారి శెభాష్ అనిపించుకున్నాడు.

sushant singh in dhoni biopic
ధోనీ బయోపిక్​లో సుశాంత్ సింగ్ రాజ్​పుత్

ఇద్దరికీ సుశాంతే నచ్చాడు!

ధోనీ బయోపిక్​ కోసం నటీనటులు ఎంపిక చాలారోజుల పాటు సాగింది. దర్శకుడు నీరజ్ పాండే చాలామందిని పరీక్షించారు. తనకు నచ్చితే, ధోనీకి నచ్చేవారు కాదు. సుశాంత్ మాత్రం ఎట్టకేలకు ఇద్దరికీ నచ్చేశాడు. తమ సినిమాకు సరైన నటుడు ఇతడే అనే నమ్మకాన్ని కుదిర్చాడు.

sushant with dhoni
ధోనీతో సుశాంత్ సింగ్ (పాత చిత్రం)

ఆ తర్వాత ధోనీతో కొన్నిరోజుల పాటు ట్రావెల్​ చేసిన సుశాంత్.. అతడి మేజరిజమ్స్, హావాభావాల్ని దగ్గర నుంచి పరిశీలించాడు. భారత మాజీ క్రికెటర్ కిరణ్ మోర్​ దగ్గర ఆటకు సంబంధించిన మెలకువల్ని నేర్చుకున్నాడు. మధ్యమధ్యలో ధోనీ ఇంటికి వెళ్లి మరీ బ్యాటింగ్ ట్రిక్స్ అతడి నుంచి తెలుసుకున్నాడు. ఎంతో క్లిష్టమైన హెలికాప్టర్​ షాట్ ప్రాక్టీసు చేస్తున్నప్పుడు అతడి పక్కటెముకులు పట్టేసిన సందర్భమూ ఉంది.

ఇది చదవండి: 'హెలికాప్టర్ షాట్​ కోసం అంతలా కష్టపడ్డాడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.