*'శాకుంతలం' సినిమా కోసం హీరోయిన్ సమంత రంగంలోకి దిగింది. ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా ఆధ్వర్యంలో ఆమె మేకప్ టెస్టు జరుగుతోంది. కాళీదాసు 'శాకుంతలం' ఆధారంగా ఈ ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
*'కంబాలపల్లి కథలు' వెబ్ సిరీస్లో తొలి భాగం 'మెయిల్' ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఉదయ్ గుర్రాల దర్శకుడు. ఈనెల 12 నుంచి ఆహా ఓటీటీలో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
*విక్రమ్ 'కోబ్రా' టీజర్(జనవరి 9 ఉదయం 10:32 గంటలకు), నాని 'టక్ జగదీష్' అప్డేట్(ఉదయం 11:07 గంటలకు) ఇవ్వనున్నట్లు నిర్మాణ సంస్థలు ప్రకటించాయి.
*కోలీవుడ్ అగ్రహీరో ధనుష్ 43వ సినిమా శుక్రవారం లాంఛంగా ప్రారంభమైంది. పాటతో షూటింగ్ మొదలుపెట్టారు. మాళవిక మోహనన్ హీరోయిన్. కార్తిక్ నరేన్ దర్శకుడు.
ఇది చదవండి: నిహారిక కొత్త వెబ్ సిరీస్.. 'మాస్టర్' టీమ్ డ్యాన్సులు