*కోలీవుడ్ హీరో విజయ్ 'మాస్టర్' సినిమా విడుదల తేదీ ఖరారైంది. తెలుగు, తమిళంలో జనవరి 13న, హిందీలో జనవరి 14న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. లోకేశ్ కనకరాజు దర్శకుడు.
*మాస్ మాహారాజా రవితేజ 'క్రాక్' డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ ఫొటోల్ని ట్విట్టర్లో పంచుకున్నారు. సంక్రాంతి కానుకగా థియేటర్లలో సినిమా విడుదల కానుంది. శ్రుతి హాసన్ హీరోయిన్. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు.
*'ద ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ రెండో సీజన్ టీజర్ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. వచ్చే ఏడాది తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సిరీస్‌ను తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. సమంత ఇందులో ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో కనిపించనుంది. రాజ్ - డీకే సంయుక్తంగా దర్శకత్వం వహించారు.
*రాజ్ - డీకే ఆధ్వర్యంలో తెరకెక్కనున్న కొత్త వెబ్ సిరీస్‌లో ఓ పాత్ర కోసం రాశీఖన్నా ఎంపికైంది. ఇందులో షాహిద్ కపూర్‌కు జోడీగా ఈమె కనిపించనుంది. విజయ్ సేతుపతి మరో కీలక పాత్ర పోషించనున్నారు.
*మాధవన్-శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటిస్తున్న తమిళ సినిమా 'మారా' ట్రైలర్ మంగళవారం విడుదలైంది. జనవరి 8 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
*శింబు నటిస్తున్న 'ఈశ్వరుడు' సినిమా కొత్త పోస్టర్ విడుదలైంది. నిధి అగర్వాల్, నందితా శ్వేత హీరోయిన్లు. సుశీంద్రన్ దర్శకుడు. సంక్రాంతి కానుకగా చిత్రం రిలీజ్ కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">