*కంగనా రనౌత్ 'ధాకడ్' విడుదల తేదీ ఖరారైంది. ఈ ఏడాది అక్టోబరు 1న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. రజనీష్ ఘాయ్ దర్శకుడు. కత్తి పట్టుకుని ఉన్న కంగన ఫొటో.. చిత్రంపై అంచనాల్ని పెంచుతోంది.
*అల్లరి నరేశ్ 'బంగారు బుల్లోడు' ట్రైలర్.. మంగళవారం సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నారు. ఇందులో నరేశ్ సరసన పూజా జావేరి నటిస్తోంది. గిరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
*'నగరం' సినిమాకు బాలీవుడ్ రీమేక్ 'ముంబయికర్' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. విజయ్ సేతుపతి, విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ శివన్ దర్శకుడు.
*జగపతి బాబు, కార్తిక్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఫాదర్ చిట్టి ఉమ కార్తిక్'. ఫిబ్రవరి 12న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ సినిమాకు విద్యాసాగర్ రాజ్ దర్శకత్వం వహించారు.
ఇవీ చదవండి: