ప్రస్తుతం వెబ్‌సిరీస్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్న సిరీస్ 'మనీ హైస్ట్'. స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇప్పటికే నాలుగు సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. క్రైమ్- డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ స్పానిష్ సిరీస్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ మరో ఆసక్తికర ప్రకటన చేసింది. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ సిరీస్ ఐదో సీజన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. ఇదే చివరి సీజన్ కూడా అవుతుందని పేర్కొంది.
-
THE HEIST COMES TO AN END
— Netflix (@netflix) July 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
PART 5. pic.twitter.com/QOgJgzsqff
">THE HEIST COMES TO AN END
— Netflix (@netflix) July 31, 2020
PART 5. pic.twitter.com/QOgJgzsqffTHE HEIST COMES TO AN END
— Netflix (@netflix) July 31, 2020
PART 5. pic.twitter.com/QOgJgzsqff
ట్విట్టర్లో సాల్వడార్ డాలీ మాస్క్‌ను పోస్ట్ చేస్తూ.. "మీ ముసుగుతో సిద్ధంగా ఉన్నారా?. చివరి సారి దీనితో మీకు అవసరం పడింది" అంటూ పేర్కొంది. ఈ క్రమంలోనే షో రన్నర్, నిర్మాత అలెక్స్ పినా మాట్లాడుతూ.. "ఈ సిరీస్‌కు ముగింపు పలికేందుకు దాదాపు సంవత్సర కాలం పట్టింది. దాని ఫలితమే ఈ ఐదో సీజన్. ఇందులో యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. కానీ, ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది" అని చెప్పుకొచ్చారు.