ETV Bharat / sitara

'మనీ హైస్ట్' ఆఖరి సీజన్​ షూట్ కంప్లీట్

ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన 'మనీ హైస్ట్' వెబ్​ సిరీస్​ ఐదో సీజన్​ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది చిత్రబృందం. ఈ సిరీస్​కు ఇదే ఆఖరి సీజన్.

Money heist
'మనీ హైస్ట్'
author img

By

Published : May 15, 2021, 12:02 PM IST

ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ దక్కించుకున్న వెబ్​సిరీస్​గా గుర్తింపు పొందింది 'మనీ హైస్ట్'. ఇప్పటివరకు నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్​ ఆఖరిదైన ఐదో సీజన్​తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన షూటింగ్​ను కూడా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. దీంతో ఈ స్టోరీ ఎండింగ్​ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ సిరీస్​లో ప్రొఫెసర్, తమాయో, బొగొత, సూరెజ్, బెర్లిన్, డెన్వెర్ పాత్రలకు చాలామంది అభిమానులు ఉన్నారు. కొత్త సీజన్​ ఆగస్టులో విడుదల కానుందని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.