విలక్షణ నటుడు మోహన్‌లాల్ కీలక పాత్రలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ చిత్రం 'దృశ్యం'. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో 2013లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, ఇతర భాషల్లో రీమేక్ అయి రికార్డు సృష్టించింది. థియేటర్‌లో ప్రేక్షకుడిని మునివేళ్లపై కూర్చోబెట్టిన ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందా? అని అందరూ ఆశగా ఎదురు చూశారు. ఆ ఆశలు త్వరలోనే నెరవేరబోతున్నాయి. గురువారం మోహన్‌లాల్ పుట్టిన రోజు సందర్భంగా 'దృశ్యం2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు.
సీక్వెల్‌నూ జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక బృందం ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. 'దృశ్యం' పేరుతో తెలుగులో వెంకటేశ్, మీనా నటించగా, హిందీలో అజయ్ దేవ్‌గణ్, శ్రియలు నటించారు. తెలుగు, హిందీ భాషల్లోనూ మంచి విజయాన్ని అందుకుంది.
-
#Drishyam #Drishyam2 pic.twitter.com/OHnue7P5uw
— Mohanlal (@Mohanlal) May 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Drishyam #Drishyam2 pic.twitter.com/OHnue7P5uw
— Mohanlal (@Mohanlal) May 21, 2020#Drishyam #Drishyam2 pic.twitter.com/OHnue7P5uw
— Mohanlal (@Mohanlal) May 21, 2020