The Kashmir files movie review: కొన్ని కొన్ని చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏ మాత్రం అంచనాలు లేకుండానే వచ్చి సూపర్‌హిట్‌గా నిలుస్తాయి. విపరీతమైన క్రేజ్, ప్రశంసలను సంపాదించుకుంటాయి. రికార్డులు సృష్టిస్తాయి. సామాన్యలు నుంచి సినీప్రముఖుల వరకు వాటి గురించే మాట్లాడుకునేలా చేస్తాయి. తాజాగా విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' కూడా ఆ జాబితాలోకే వస్తుంది.
Prabhas Radheshyam: దేశవ్యాప్తంగా అభిమానులు.. ప్రభాస్ , పూజాహేగ్డే నటించిన 'రాధేశ్యామ్' కోసం ఎంతగా ఎదురుచూశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడ చూసిన ఈ చిత్రం గురించే మాట్లాడుకున్నారు. ఈ మూవీకి ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలోనే జరిగాయి. ఎట్టకేలకు మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల స్క్రీన్లపై విడుదలైంది. అయితే అదే రోజు ఎటువంటి అంచనాలు లేకుండా అనూహ్యంగా తెరపైకి వచ్చింది 'ది కశ్మీర్ ఫైల్స్'. అంతే అంచనాలు తారుమారయ్యాయి. 'రాధేశ్యామ్' మిక్స్డ్ టాక్‌ను అందుకోగా.. పరిమిత స్క్రీన్లపై రిలీజ్ అయిన 'కశ్మీర్ ఫైల్స్' తొలి రోజు మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్‌ను అందుకుంది. మొదటి రోజు ముగిసే సమయానికి సినిమా మరింత బలపడింది. దీంతో మెల్లమెల్లగా ఈ చిత్రం గురించి అందరికీ తెలిసింది. హిట్ టాక్ అందుకోవడం వల్ల క్రమక్రమంగా సినీప్రియులకు దీన్ని వీక్షించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో 'కశ్మీర్ ఫైల్స్' స్క్రీన్స్, షోస్ పెరగడం, భారీగా బుకింగ్స్ అవ్వడం వల్ల మంచి వసూళ్లను అందుకుంటోంది.
సినిమా కథాంశం
The Kashmir files story: 'ది తాష్కెంట్ ఫైల్స్' సినిమాతో సినీప్రియులను మెప్పించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఆయన తెరకెక్కించిన చిత్రమే 'ది కశ్మీర్ ఫైల్స్'. 90వ దశకంలో కశ్మీర్ పండిట్‌లపై జరిగిన మారణ హింసాకాండకు దృశ్య రూపమే ఈ చిత్రం. 1990లో కశ్మీర్లో హిందూ పండిట్స్పై జిహాదీలు దారుణ మారణకాండకు పాల్పడ్డారు. వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వారికి అక్కడ నిలువ నీడ లేకుండా చేసి స్వదేశంలోనే శరణార్థులుగా అయ్యేలా చేశారు. మొత్తంగా కశ్మీర్ లోయలో చోటు చేసుకున్న ఈ భయానక సంఘటనలతో కశ్మీర్ పండిట్స్ కట్టుబట్టలతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. మొత్తంగా కశ్మీర్‌లోని తీవ్రవాదులు, వేర్పాటువాదుల దాడుల వల్ల ఓ సామాజిక వర్గం ఎలా అంతమైందో ఈ మూవీలో భావోద్వేగభరితంగా చూపించారు. కాగా, ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రధాని మోదీ ప్రశంసలు
Modi praises The Kashmir files: ఈ సినిమా చిత్రబృందం.. శనివారం(మార్చి 12) ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని, మూవీయూనిట్‌ను అభినందించారు మోదీ. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ ట్వీట్ చేశారు. మోదీతో కలిగి దిగిన ఫొటోలు పోస్ట్ చేశారు. "గౌరవనీయులైన ప్రధానమంత్రి మోదీని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాను ఆయన ప్రశంసించడం, దాని గొప్పతనం గురించి చెప్పిన మాటలు మాకు ఎంతో ప్రత్యేకం. ఈ మూవీని నిర్మించడంలో మేము ఎవ్వరూ గర్వపడలేదు. ధన్యవాదాలు మోదీజీ" అని వ్యాఖ్య రాసుకొచ్చారు.
-
I am so glad for you @AbhishekOfficl you have shown the courage to produce the most challenging truth of Bharat. #TheKashmirFiles screenings in USA proved the changing mood of the world in the leadership of @narendramodi https://t.co/uraoaYR9L9
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">I am so glad for you @AbhishekOfficl you have shown the courage to produce the most challenging truth of Bharat. #TheKashmirFiles screenings in USA proved the changing mood of the world in the leadership of @narendramodi https://t.co/uraoaYR9L9
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 12, 2022I am so glad for you @AbhishekOfficl you have shown the courage to produce the most challenging truth of Bharat. #TheKashmirFiles screenings in USA proved the changing mood of the world in the leadership of @narendramodi https://t.co/uraoaYR9L9
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 12, 2022
సినీవిశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ చెప్పిన వివరాలు
- 'రాధేశ్యామ్', ఇటీవలే విడుదలై 'గంగూబాయ్ కతియావాడి', 'ది బ్యాట్‌మ్యాన్' కన్నా 'ది కశ్మీర్ ఫైల్స్'ను వీక్షించడానికే సినీప్రియులు ప్రాధాన్యత ఇస్తున్నారట!
- స్క్రీన్స్, షోలు పెరిగాయి
- తొలి షో ఉదయం 6.30గంటలకే ప్రదర్శన అవుతోంది
- నేడు(ఆదివారం) బుకింగ్స్ కూడా భారీగా అయ్యాయి.
కలెక్షన్లు పెరిగాయి
The Kahmir files collections: సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడం వల్ల రెండో రోజు కలెక్షన్లు రెండింతలు పెరిగాయి. రెండో రోజు 139.44శాతం గ్రోత్‌ను చూపించింది. 2020 తర్వాత.. సినిమా రిలీజ్ అయిన రెండో రోజు ఈ స్థాయిలో గ్రోత్ చూపించడం ఇదే తొలిసారి.
- తొలి రోజు 3.55 కోట్లు వసూలు చేసింది.
- రెండో రోజు 8.50కోట్లు.
- మొత్తంగా రెండు రోజుల్లో రూ.12.05కోట్లు.
ఘనత
The Kahmir files highest rating: ఈ చిత్రం ఓ ఘనతను కూడా అందుకుంది. ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎమ్‌డీబీలో అత్యధిక రేటింగ్ అందుకున్న చిత్రంగా నిలిచింది. 10/10 రేటింగ్‌ను అందుకుంది.
ఇదీ చూడండి: ఓటీటీలో 'స్పైడర్‌మ్యాన్'.. 'ది కశ్మీర్ ఫైల్స్' రికార్డు!