ETV Bharat / sitara

దానికోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: రష్మిక - Rashmika Mandanna bollywood debut

Misson Majnu Movie: 'మిషన్‌ మజ్ను' తన మనసుకు ఎంతో దగ్గరగా ఉండే చిత్రమని తెలిపింది నటి రష్మిక. ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. కాగా, ఈ మూవీలో హీరోగా నటిస్తున్న సిద్ధార్థ్​ను ప్రశంసించిన ఆమె.. అతడు గొప్ప నటుడే కాదు.. మంచి మనసున్న వ్యక్తి అని కితాబిచ్చింది.

Misson Majnu Movie
రష్మిక
author img

By

Published : Jan 4, 2022, 6:42 AM IST

Updated : Jan 4, 2022, 7:04 AM IST

Misson Majnu Movie: ''మిషన్‌ మజ్ను' చిత్రంతో ప్రయాణం ప్రారంభించడానికి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా' అంటోంది నటి రష్మిక. ప్రస్తుతం దక్షిణాదిలో స్టార్‌ నాయికగా మెరుపులు మెరిపిస్తుతున్న ఈ అమ్మడు.. ఇప్పుడీ హిందీ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది. సిద్ధార్థ్‌ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం.. త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది.

'మిషన్‌ మజ్న' స్టోరీ డిస్కషన్‌లో సిద్ధార్థ్‌తో కలిసి పని చేసిన అనుభవాలను ఓ మీడియాతో రష్మిక పంచుకుంది. "నా మనసుకు ఎంతో దగ్గరగా ఉండే చిత్రమిది. ఈ సినిమా కోసం తొలిసారి సిద్ధార్థ్‌ను కలిసినప్పుడు.. మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం. తను గొప్ప నటుడే కాదు.. మంచి మనసున్న వ్యక్తి కూడా. ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని నేనెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా" అని చెప్పింది రష్మిక.

ఇదీ చదవండి: 'నాకు కాబోయే భర్త ఇల్లరికం రావాల్సిందే'

Last Updated : Jan 4, 2022, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.