ETV Bharat / sitara

Mirzapur awards: 'మీర్జాపుర్' సిరీస్​కు ఇంటర్నేషనల్​ అవార్డులు

author img

By

Published : Dec 4, 2021, 6:33 PM IST

Mirzapur season 2: యువతతో పాటు ఓటీటీ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించిన 'మీర్జాపుర్' వెబ్ సిరీస్.. పలు ఇంటర్నేషనల్​ అవార్డులు గెలుచుకుంది. ఇంతకీ అ అవార్డులేంటి? వాటి సంగతి ఏంటంటే?

Mirzapur web series
మీర్జాపుర్ వెబ్ సిరీస్

ఆసియన్ అకాడమీ క్రియేటివ్ అవార్డ్స్​లో నటి కొంకన సేన్ శర్మ, అమృత సుభాష్ అదరగొట్టారు. యూత్​ను ఎంతగానో ఆకట్టుకున్న 'మీర్జాపుర్' వెబ్ సిరీస్​ కూడా రెండు అవార్డులు దక్కించుకుంది.

సింగపూర్​లో గురువారం-శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో వివిధ క్రియేటివ్ ఫ్లాట్​ఫామ్స్​లో మెప్పించిన పలువురికి అవార్డులు అందజేశారు. టీవీ, స్ట్రీమింగ్​ కంటెంట్​కు సంబంధించి మొత్తం 38 అవార్డులు బహుకరించారు.

Mirzapur munna bhayya
మీర్జాపుర్ వెబ్ సిరీస్​లో మున్నాభయ్యా

Mirzapur season 2: అమెజాన్ ప్రైమ్​లో అందుబాటులో ఉన్న యాక్షన్ డ్రామా 'మీర్జాపుర్'.. బెస్ట్ ఒరిజినల్​ ప్రోగ్రామ్ విభాగంలో రెండు అవార్డులు గెలుచుకుంది. అయితే ఈ అవార్డును సిరీస్​లో నటించిన బ్రహ్మస్వరూప్​కు అంకితమిస్తున్నట్లు సిరీస్​ సృష్టికర్త పునీత్ కృష్ణ చెప్పారు. శుక్రవారం తన అపార్ట్​మెంట్​లో అనుమానస్పద రీతిలో మరణించారు బ్రహ్మస్వరూప్ మిశ్రా.

నెట్​ఫ్లిక్స్ ఆంథాలజీ 'అజీబ్ దస్తాన్స్'లో 'గీలి పుచ్చి' ఎపిసోడ్​లో నటించిన బెంగాలీ నటి కొంకన సేన్ శర్మ.. ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది.

'బొంబాయ్ బేగమ్స్'లో బార్ డ్యాన్సర్​గా నటించి మెప్పించిన అమృతా సుభాష్​కు ఉత్తమ సహాయనటిగా అవార్డు దక్కింది.

కొరియన్ సిరీస్ 'మూవ్ టూ హెవెన్'తో ఆకట్టుకున్న లీ జీ హున్​.. ఉత్తమ నటుడు అవార్డు సొంతం చేసుకున్నారు. 'స్వీట్ హోమ్' సిరీస్​తో మెప్పించిన లీ డో హ్యూన్.. ఉత్తమ సహయనటుడిగా నిలిచారు. ఈ సిరీస్​ను తెరకెక్కించిన లీ యొంగ్ బొక్​కు ఉత్తమ దర్శకుడి పురస్కారం దక్కింది.

Konkona Sen Sharma
కొంకణ సేన్ శర్మ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.