ETV Bharat / sitara

మగబిడ్డకు జన్మనిచ్చిన 'మిర్చి' భామ - రిచా గంగోపాధ్యాయ కెరీర్

టాలీవుడ్​లో 'మిరపకాయ్', 'మిర్చి' లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది రిచా గంగోపాధ్యాయ్. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. అమెరికాకు చెందిన తన సహోద్యోగిని పెళ్లాడిన రిచా.. తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

richa
రిచా
author img

By

Published : Jun 5, 2021, 11:49 AM IST

Updated : Jun 5, 2021, 12:21 PM IST

తెలుగు తెరపై తళుక్కున మెరిసి మాయమైన కథానాయికల్లో ఒకరు రిచా గంగోపాధ్యాయ. నాగార్జున, వెంకటేశ్​, రవితేజ, ప్రభాస్​, రానా వంటి స్టార్​హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకుందీ అందాల భామ. అయితే అనంతరం అనూహ్యంగా రీల్​ తెరకు గుడ్​బై చెప్పేసింది. గతేడాది అమెరికాకు చెందిన తన సహాధ్యాయి జో లాంగెల్లాను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడింది. తాజాగా ఈ జంటకు పండంటి మగబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసిందీ నటి.

richa
బాబుతో రిచా

"మా చిన్ని సంతోషం లూకా షాన్ లాంగెల్లా. మే 27న ఈ ప్రపంచానికి విచ్చేశాడు. అతడి అందమైన ముఖాన్ని చూస్తూ ఉండటం చాలా బాగుంది. వాళ్ల నాన్న లాగే సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. హెయిర్, ముక్కు మాత్రం తల్లి పోలిక" అంటూ ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది రిచా.

'లీడర్‌' చిత్రంతో తెలుగుతెరకు రిచా గంగోపాధ్యాయ్‌ నటిగా పరిచయమైంది. మొదటి సినిమాతో ఆకట్టుకున్న ఆమె 'నాగవల్లి', ‘మిరపకాయ్‌’, 'సారొచ్చారు' వంటి చిత్రాల్లో నటించింది. 'మిర్చి' ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2013లో 'భాయ్‌' సినిమా తర్వాత ఉన్నత విద్య కోసం ఆమె అమెరికా వెళ్లింది. అక్కడ బిజినెస్‌ స్కూల్‌లో జోను ప్రేమించి.. పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే ఆమె నటనకు దూరమైంది.

Last Updated : Jun 5, 2021, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.