ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ సినిమాలు భారీ సెట్స్‌కు పెట్టింది పేరు. 'ఒక్కడు', 'రుద్రమదేవి' తదితర సినిమాలే ఇందుకు ఉదాహరణ. ఆయన నుంచి రాబోతున్న మరో క్రేజీ ప్రాజెక్టు 'శాకుంతలం'. సమంత టైటిల్ రోల్లో నటిస్తోంది. మహాభారతం ఆదిపర్వంలోని ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు.
మరి ఇలాంటి ఇతిహాస కథను కళ్లకు కట్టినట్టు చూపించాలంటే కళాత్మకంగా ఎంతో శ్రమించాలి. ప్రస్తుతం అదే పనిలో ఉంది చిత్రబృందం. అన్నపూర్ణ స్టూడియోలో ప్రముఖ కళా దర్శకుడు అశోక్ సంబంధిత నమూనా సెట్స్‌ను రూపొందించి ఔరా అనిపిస్తున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
-
Before the grand sets are erected .. the miniatures get their finishing touches by Art Director Ashok Garu himself!
— Gunaa Teamworks (@GunaaTeamworks) January 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
This morning at Annapurna Studios.#Shaakuntalam #EpicLoveStory #MythologyforMilennials @Gunasekhar1 @Samanthaprabhu2#Manisharma @neelima_guna@GunaaTeamworks pic.twitter.com/eRCl2C4Bhv
">Before the grand sets are erected .. the miniatures get their finishing touches by Art Director Ashok Garu himself!
— Gunaa Teamworks (@GunaaTeamworks) January 23, 2021
This morning at Annapurna Studios.#Shaakuntalam #EpicLoveStory #MythologyforMilennials @Gunasekhar1 @Samanthaprabhu2#Manisharma @neelima_guna@GunaaTeamworks pic.twitter.com/eRCl2C4BhvBefore the grand sets are erected .. the miniatures get their finishing touches by Art Director Ashok Garu himself!
— Gunaa Teamworks (@GunaaTeamworks) January 23, 2021
This morning at Annapurna Studios.#Shaakuntalam #EpicLoveStory #MythologyforMilennials @Gunasekhar1 @Samanthaprabhu2#Manisharma @neelima_guna@GunaaTeamworks pic.twitter.com/eRCl2C4Bhv
గుణ టీమ్ వర్క్స్ పతాకంపై గుణ నీలిమ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే సంగీత చర్చలు ప్రారంభమయ్యాయి.
ఇది చదవండి: సమంత రికార్డు.. దక్షిణాదిలోనే తొలి నటిగా