మిల్కీబ్యూటీ తమన్నా పెళ్లి కబురు కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తమ కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నామని ఈ హీరోయిన్ తల్లి ఇటీవల చెప్పారు. ఈ క్రమంలో ఆమె పెళ్లిపై అనేక వార్తలు వచ్చాయి. కానీ వాటన్నంటినీ తమన్నా ఖండించింది. అయితే తాజాగా ఈ భామ తన వివాహం గురించి ముచ్చటించింది.
"మీకే స్వయంవరం పెడితే.. ఏ నటులు రావాలని కోరుకుంటారు" అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది తమన్నా. స్వయంవరం కోసం ముగ్గురు నటుల్ని ఎంచుకోమని అడగగా.. "ప్రభాస్, హృతిక్ రోషన్, విక్కీ కౌశల్" అని టక్కున సమాధానం చెప్పింది.

అంతేకాదు ఇంతవరకు తమన్నా ఏ సినిమాలోనూ ముద్దు సన్నివేశాల్లో నిజంగా నటించలేదు. ఆమెతో అలాంటి సన్నివేశాలు తీయాలంటే కెమెరా ట్రిక్కులు వాడాల్సిందే. సినిమాకు సంతకం చేయడానికి ముందే తమన్నా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది. అయితే హృతిక్ కోసమైతే తన నో-కిస్ ఒప్పందాన్ని పక్కనపెడతానని చెప్పిందీ భామ.
సాధారణంగా నేను స్క్రీన్‌పై కిస్ చేయను. నా ఒప్పందాల్లో అది ఒకటి. కానీ హృతిక్ రోషన్‌తో అయితే చేస్తానని నా స్నేహితులతో జోక్‌లు వేస్తుంటా.
తమన్నా, సినీ నటి
మరి తమన్నా మాటలకు హృతిక్, విక్కీ కౌశల్, ప్రభాస్ ఎలా స్పందిస్తారో చూడాలి.
