పెళ్లిలో తాళి, తలంబ్రాల తంతు తర్వాత అందరూ చూసేది దుస్తుల గురించి. సెలబ్రిటీల పెళ్లిలో అయితే అది ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. డిజైనర్ వేర్‌తో ధగధగ మెరిసోతుంటారు మరి. రానా-మిహీక పెళ్లిలో కూడా ఇదే జరిగింది. ఓవైపు వధువు మిహీక బంగారు, క్రీమ్ రంగు లెహంగాలో మెరిసిపోగా, సమంత.. నీలం రంగు చీరలో అదిరిపోయింది. దుస్తులే కాదు. వాటి ధరలు కూడా అదిరిపోయాయట.
![మిహీక](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8355539_741_8355539_1596972001195.png)
మిహీక డ్రెస్‌ను ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా డిజైన్ చేశారు. ఈ డ్రెస్ వెనుక వందల గంటల శ్రమ ఉందట. డ్రెస్ మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారట. ఈ ఒక్క డ్రెస్ కోసం మిహీక సుమారు₹6 లక్షలు ఖర్చు చేసినట్లు టాలీవుడ్ వర్గాల భోగట్టా. హల్దీ వేడుకలో ఆమె ధరించిన పసుపు రంగు డ్రెస్ కూడా లక్షల ₹2 లక్షల వరకు ఉంటుందటున్నారు. దీనికి అర్పితా మెహతా డిజైన్ చేశారట.
![సమంత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8355539_812_8355539_1596971949614.png)
ఇక సమంత డ్రెస్ విషయానికొస్తే... పెళ్లికి నీలం రంగుపై ఎంబ్రాయిడరీ చేయించిన చీరలో వచ్చింది. దీనిని 'రా మాంగో' టీమ్ డిజైన్ చేసింది. దీని ధర లక్షల్లో ఉంటుందంటున్నారు. ఇక హల్దీ వేడుకలో సమంత ధరించి డ్రెస్ హైలైట్‌గా నిలిచింది. దీనిని అర్పిత మెహతా డిజైన్ చేశారు. దీని ధర ₹1.59 లక్షలు అని సమాచారం.