ETV Bharat / sitara

చిరు కొత్త సినిమా అప్​డేట్​ అప్పుడేనా?

author img

By

Published : Aug 3, 2020, 9:38 AM IST

Updated : Aug 3, 2020, 10:00 AM IST

మెగాస్టార్​ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా అప్​డేట్​ రానుందని సమాచారం. యువదర్శకుడు కె.ఎస్​.రవీంద్ర (బాబీ) ఇటీవలే పూర్తి కథను చిరుకు వినిపించాడని.. ఈ ప్రకటనే ఆగస్టు 22న ఉంటుందట.

చిరు కొత్త సినిమా అప్​డేట్​ అప్పుడేనా?
మెగాస్టార్ చిరంజీవి

కథానాయకుల పుట్టినరోజు వస్తోందంటే చాలు...కొత్త సినిమా కబుర్లేమైనా బయటికొస్తాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు అభిమానులు. హీరోలూ ఆ సందడి మధ్యే సినిమా కబుర్లు వెల్లడించడానికి ఇష్టపడుతుంటారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి పుట్టినరోజు ఈ నెలలోనే. ఆయన ఇప్పటికే పలువురు యువ దర్శకులతో సినిమాలు చేయడానికి పచ్చజెండా ఊపారు. వాటికి సంబంధించిన స్క్రిప్టు పనులు జోరుగా సాగుతున్నాయి.

ఇటీవలే దర్శకుడు కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) పూర్తి కథని సిద్ధం చేసి చిరంజీవికి వినిపించినట్టు సమాచారం. ఆయన పచ్చజెండా ఊపేశారని, ఈ పుట్టినరోజుకే ఆ సినిమాకి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలున్నాయనే మాట చిత్ర పరిశ్రమలో వినిపిస్తోంది. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తున్నారు.

Last Updated : Aug 3, 2020, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.