పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తర్వాత నటించిన చిత్రం 'వకీల్‌సాబ్'. శుక్రవారం థియేటర్లలో విడుదలై విశేషాదరణ దక్కించుకుంటోంది. బెన్ఫిట్షో నుంచి సినిమాహాళ్ల అభిమానుల సందడి మొదలైంది. వరుస షోలతో 'వకీల్‌సాబ్' కలెక్షన్ల పరంగానూ దూసుకుపోతుంది.
అయితే ఈ సినిమాను థియేటర్లోనూ వీక్షిస్తానని చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.. శుక్రవారం రాత్రి కుటుంబ సమేతంగా 'వకీల్‌సాబ్' చిత్రాన్ని వీక్షించారు. చిరంజీవితో పాటు ఆయన తల్లి అంజనాదేవి, సతీమణి సురేఖ.. నాగబాబు కుటుంబం, సాయితేజ్ ఈ సినిమాను విడివిడిగా వీక్షించారు. ఈ చిత్రంతో పవన్ కల్యాణ్.. పవర్ ప్యాక్డ్ కమ్‌బ్యాక్ అంటూ వరుణ్‌తేజ్, సాయితేజ్ ట్వీట్ చేశారు. మరోవైపు యువ కథానాయకుడు నిఖిల్ కూడా కుటుంబ సమేతంగా స్నేహితులతో వెళ్లి చిత్రాన్ని వీక్షించారు.
ఇదీ చూడండి: సమీక్ష: పవన్ 'వకీల్‌సాబ్ 'ఎలా ఉందంటే?