సైదాబాద్ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లకొండ రాజు ఆత్మహత్య(saidabad accused raju) చేసుకున్నాడు. స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలోని నక్కల్ రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని(saidabad raju dead body) గుర్తించారు. చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని నిర్ధారించారు. దీంతో రాజు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. పాపకు న్యాయం జరిగిందంటూ ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా అగ్ర కథానాయకుడు చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
"అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కిరాతకుడు రాజు తనకు తానే శిక్షించుకోవడం బాధిత కుటుంబంతో సహా అందరికీ కొంత ఊరట కలిగిస్తుంది. ఈ సంఘటనపై మీడియా, పౌర సమాజం గొప్పగా స్పందించాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతో పాటు, పౌర సమాజం చొరవ చూపాలి. అటువంటి కార్యక్రమం ఎవరు చేపట్టినా వారికి నా సహకారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి" అని చిరంజీవి(saidabad chiranjeevi) ట్వీట్ చేశారు.
-
Let’s not allow such dastardly acts to recur and let’s do whatever it takes towards this goal! #JusticeForChaithra pic.twitter.com/yWX5bwDloN
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Let’s not allow such dastardly acts to recur and let’s do whatever it takes towards this goal! #JusticeForChaithra pic.twitter.com/yWX5bwDloN
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 16, 2021Let’s not allow such dastardly acts to recur and let’s do whatever it takes towards this goal! #JusticeForChaithra pic.twitter.com/yWX5bwDloN
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 16, 2021
రాజు ఆత్మహత్య చేసుకున్న ఘటనను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించగా, ఆయన ట్వీట్‌ను మంచు మనోజ్ రీట్వీట్ చేస్తూ 'సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు సర్.. దేవుడు ఉన్నాడు' అని పేర్కొన్నారు.
-
Thank you for the news sir.. God is there … #OmShantiChaitra #Chaitra https://t.co/hhe0UxFVNd
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank you for the news sir.. God is there … #OmShantiChaitra #Chaitra https://t.co/hhe0UxFVNd
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 16, 2021Thank you for the news sir.. God is there … #OmShantiChaitra #Chaitra https://t.co/hhe0UxFVNd
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 16, 2021
"కోర్టుల్లేవు.. విచారణల్లేవు.. మానవ హక్కుల సంఘాల్లేవు..పేజీలకు పేజీల ఆరాల్లేవు.. ఎదురు చూసే పనులు అస్సల్లేవు.. చిట్టి తల్లి కన్న తల్లిదండ్రుల బాధకు కాస్త ఊరట కలిగిస్తూ, వారు కోరుకున్న న్యాయం జరిగిందని ఆశిస్తూ.." అంటూ సందీప్ అనే నెటిజన్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
"చట్టం నుంచి తప్పించుకోవచ్చేమో గానీ ఆ దైవం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు.. అభంశుభం తెలియని ఆ పసికందును అతి కిరాతకంగా హత్య చేసిన ఆ నరరూప రాక్షసుడికి దైవం సరైన శిక్ష విధించింది.. పాప ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం" అని రఫీక్ అనే మరో నెటిజన్ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి: తెరపై విలన్‌గా.. నిజ జీవితంలో మాత్రం గొప్ప ప్రేమికుడు