మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకులతో వరుసపెట్టి సినిమాలు చేయబోతున్నట్లు ఈ మధ్యే ప్రకటించారు. దాంతో వాటిపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య'తో బిజీగా ఉండగా.. ఆ తర్వాత సుజీత్, బాబీలతో కలిసి పనిచేయనున్నారు మెగాస్టార్. మెహర్ రమేశ్ డైరక్షన్లోనూ నటించనున్నట్లు చిరంజీవి ఓ సందర్భంలో చెప్పినా.. దానిపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ పవన్ కల్యాణ్ ట్వీట్‌తో అది దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది.
-
Thank you Ramesh. Wishing you all the best for your forth coming film with Sri Chiranjeevi garu.🙏
— Pawan Kalyan (@PawanKalyan) September 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank you Ramesh. Wishing you all the best for your forth coming film with Sri Chiranjeevi garu.🙏
— Pawan Kalyan (@PawanKalyan) September 3, 2020Thank you Ramesh. Wishing you all the best for your forth coming film with Sri Chiranjeevi garu.🙏
— Pawan Kalyan (@PawanKalyan) September 3, 2020
పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు మెహర్ రమేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిగా ట్వీట్ చేసిన పవన్.. "చిరంజీవితో తీయబోయే కొత్త చిత్రానికి ఆల్ ది బెస్ట్" అని సమాధానమిచ్చారు.
తమిళ సూపర్‌హిట్ 'వేదాళం'ను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మెహర్ తయారు చేశారట. పూర్తి వివరాలు కోసం మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే.
ఇదీ చూడండి: డ్రగ్స్ కేసులో స్టార్ హీరోయిన్‌కు నోటీసులు