ETV Bharat / entertainment

చిరంజీవి నట విశ్వ రూపానికి 28 ఏళ్లు - ఆపద్బాంధవుడు 28 ఏళ్లు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన క్లాస్ చిత్రం 'ఆపద్బాంధవుడు'. ఈ సినిమా విడుదలై నేటికి 28 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం.

Megastar Chiranjeevi Aapadbandhavudu completed 28 years
చిరు నట విశ్వరూపానికి 28 ఏళ్లు
author img

By

Published : Oct 9, 2020, 4:52 PM IST

Updated : Jun 29, 2022, 1:15 PM IST

'గ్యాంగ్‌ లీడర్‌', 'రౌడీ అల్లుడు', 'ఘరానా మొగుడు' వరుసగా మూడు హ్యాట్రిక్‌ విజయాలతో జోరుమీదున్న చిరంజీవి ఆ తర్వాత నటించిన వైవిధ్యమైన క్లాస్‌ చిత్రం 'ఆపద్బాంధవుడు'. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై (అక్టోబరు 9) 28 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నటనాపరంగా చిరంజీవిని మరోస్థాయికి తీసుకెళ్లింది.

Megastar Chiranjeevi Aapadbandhavudu completed 28 years
శివుని పాత్రలో

చిరు అభినయంతో ఈ చిత్రాన్ని తన భుజస్కందాలపై మోశారు. ఇందులో శివుడి పాత్రలోనూ కనిపించి అలరించారు. చిరంజీవితో పాటు మీనాక్షి శేషాద్రి, శరత్‌బాబు, రచయిత, దర్శకుడు జంధ్యాల గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకు ప్రాణం పోశారు. తనదైన పాటలు, సంగీతంతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు. ఆయన స్వరపరిచిన పాటలు ఇప్పటికీ అలరిస్తూనే ఉంటాయి.

చిరంజీవి

జంధ్యాల తొలిసారి మేకప్‌ వేసుకున్న చిత్రమిది. ఈ సినిమాకు సంభాషణలు అందించిన జంధ్యాల.. ఇందులోని పరంధామరాజు పాత్రని ప్రేమించడం మొదలెట్టారు. చివరకు ఈ పాత్ర తానే చేస్తానని నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకి చెప్పడం వల్ల ఆయన ఈ విషయాన్ని దర్శకుడు కె.విశ్వనాథ్‌కు చెప్పారు. అలా జంధ్యాల నటించిన మొదటి, చివరి చిత్రంగా 'ఆపద్బాంధవుడు' నిలిచింది.

నంది అవార్డు అందుకుంటూ

ఉత్తమ నటుడిగా రెండోసారి నంది అవార్డు అందుకోవడమే కాదు, ఆ ఏడాది జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి కేటగిరిలో చిరు గట్టి పోటీ ఇచ్చారు. ఇక ఈ చిత్రం మొత్తం ఐదు కేటగిరీల్లో నంది అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ రచయిత, ఉత్తమ కళా దర్శకుడు, ఉత్తమ కొరియోగ్రాఫర్‌ విభాగాల్లో అవార్డులు రాగా, చిరు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ సొంతం చేసుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Jun 29, 2022, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.