ETV Bharat / sitara

ఆయన పంపిన గిఫ్ట్​కు మెగాస్టార్ చిరు ఫిదా! - Mohan Babu's Birthday Gift to chiranjeevi

సీనియర్ నటుడు మోహన్​బాబు పంపిన బహుమతికి మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయ్యారు. ఆ ఫొటోను ట్వీట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు.

ఆయన పంపిన గిఫ్ట్​కు మెగాస్టార్ చిరు ఫిదా!
కళాకృతితో మెగాస్టార్ చిరంజీవి
author img

By

Published : Aug 23, 2020, 2:59 PM IST

Updated : Aug 23, 2020, 3:04 PM IST

మెగాస్టార్ చిరంజీవి శనివారం తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కలెక్షన్ కింగ్ మోహన్​బాబు మాత్రం ట్వీట్ చేయడమే కాకుండా ఓ చక్కటి కళాకృతిని బహుమతిగా పంపించారు. ముగ్ధుడైన చిరు.. దానిని చూసి మురిసిపోయారు. ట్విట్టర్​ వేదికగా ఆనందాన్ని పంచుకున్నారు.

chiru tweet
చిరు ట్వీట్

"నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి. థాంక్యూ మోహన్​బాబు" - మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

చిరు బర్త్​డే సందర్భంగా ఆయన నటిస్తున్న 'ఆచార్య' ఫస్ట్​లుక్ కూడా విడుదలైంది. కత్తి పట్టుకుని మాస్​ లుక్​లో కనిపించారు మెగాస్టార్. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవికి తీసుకొస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

acharya first look
ఆచార్య సినిమా ఫస్ట్​లుక్

Last Updated : Aug 23, 2020, 3:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.