ETV Bharat / sitara

Prabhas Saalar: సలార్​లో ప్రభాస్‌కు జోడీగా మరో నాయిక? - సలార్​ సినిమాలో ప్రభాస్​ పక్కన మీనాక్షి చౌదరి

యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్​ నీల్​ కాంబినేషన్​లో 'సలార్' చిత్రం(Salaar Movie Updates) రూపొందుతోంది. ఇందులో హీరోయిన్​గా శ్రుతిహాసన్​ కనిపించనుండగా.. ఓ ప్రత్యేక గీతం కోసం మరో నాయికను (Salaar Heroine Updates) చిత్ర బృందం ఎంపిక చేసింది. 'ఖిలాడీ​' భామ మీనాక్షి చౌదరిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

salaar
సలార్​
author img

By

Published : Oct 13, 2021, 7:47 AM IST

ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ (KGF Movie Director) తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం 'సలార్‌'(Salaar Movie Updates). హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శ్రుతిహాసన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె కాక ప్రత్యేక గీతం కోసం మరో నాయికను రంగంలోకి దింపనున్నారు. ఆ పాత్ర కోసం ఇప్పటికే శ్రీనిధి శెట్టి, శ్రద్ధా కపూర్‌ల పేర్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఇప్పుడీ చిత్రం కోసం 'ఖిలాడీ' భామ మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్లు సమాచారం (Salaar Movie Updates) అందుతోంది. ఈ సినిమాలో శ్రుతితో పాటు మరో నాయిక పాత్రకు ప్రాధాన్యముందని, ఇప్పుడా పాత్ర కోసమే మీనాక్షిని ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో జరగనున్న కొత్త షెడ్యూల్‌లో ఆమె చిత్ర బృందంతో కలవనున్నట్లు తెలుస్తోంది.

విభిన్నమైన మాస్‌, యాక్షన్‌ అడ్వంచరస్‌ చిత్రమిది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ సినిమాలో జగపతిబాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రవి బస్రూర్‌ స్వరాలందిస్తున్నారు. భువన్‌ గౌడ ఛాయాగ్రాహ కుడిగా వ్యవహరిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏప్రిల్‌ 14న(Salaar Movie Release Date) ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే వెల్లడించింది.

ఇదీ చూడండి: క్యూట్​గా రకుల్​ప్రీత్​ .. హాట్​ ఫోటోషూట్​తో దిశా పటానీ ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.