సంక్రాంతికి 'మాస్టర్'గా వచ్చిన కోలీవుడ్ హీరో విజయ్.. తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. లోకేశ్ కనకరాజన్ దర్శకత్వ ప్రతిభపై ప్రశంసలు వచ్చాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారట.
ఇటీవల ఇంటికి వెళ్లి విజయ్ను కలిసిన లోకేశ్.. ఓ స్క్రిప్ట్ ఆయనకు వినిపించారట. దీనికి విజయ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రీకరణ మొదలుపెట్టనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం తన 65వ సినిమాతో బిజీగా ఉన్నారు విజయ్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ప్రీ ప్రొడక్షన్ జరుగుతుండగా, త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">