సినీప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన హాలీవుడ్ యాక్షన్ చిత్రం 'టెనెట్' ఆగస్టు 26న బుధవారం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అయితే లండన్‌లోని ఓ థియేటర్లో అభిమానులతో కలిసి కేరింతలు కొడుతూ దర్శకుడు క్రిస్టోఫర్ నొలాన్, స్టార్ హీరో టామ్ క్రూజ్ ఈ సినిమాను వీక్షించారు.
ఈ చిత్రం అద్భుతంగా ఉందని కొనియాడిన క్రూజ్.. మళ్లీ థియేటర్లో కూర్చొని సినిమాను చూడడంపై హర్షం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్ చేశాడు. ఇందులో మాస్క్ ధరించడం సహా కరోనా జాగ్రత్తలు పాటిస్తూ సినిమాను ఎంజాయ్ చేశాడు క్రూజ్.
-
Big Movie. Big Screen. Loved it. pic.twitter.com/DrAY5tRg5P
— Tom Cruise (@TomCruise) August 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Big Movie. Big Screen. Loved it. pic.twitter.com/DrAY5tRg5P
— Tom Cruise (@TomCruise) August 25, 2020Big Movie. Big Screen. Loved it. pic.twitter.com/DrAY5tRg5P
— Tom Cruise (@TomCruise) August 25, 2020
అమెరికాలో ఈ చిత్రం ఆగస్టు 31న విడుదల కాగా.. భారత్‌లో రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ప్రస్తుతం క్రూజ్.. క్రిస్టోఫర్ మెక్‌క్వారీ దర్శకత్వంలో 'మిషన్' ఇంపాజిబుల్-7లో నటిస్తున్నాడు.
సైన్స్ ఫిక్షన్ నేపథ్య కథతో 'టెనెట్' చిత్రాన్ని తెరకెక్కించారు క్రిస్టోఫర్ నొలాన్. రాబర్ట్ ప్యాటిన్సన్, జాన్ డేవిడ్ వాషింగ్టన్, డింపుల్ కపాడియా, కెన్నెత్ బ్రానాగ్ తదితరులు ఇందులో కీలకపాత్రలు పోషించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇది చూడండి 'కేజీఎఫ్ 2' షూట్లో ప్రకాశ్‌రాజ్.. ఎలివేషన్స్ షురూ