టాలీవుడ్ హీరో నాగార్జున కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం 'మన్మథుడు'. అమ్మాయిలను అసహ్యించుకునే పాత్రలో కడుపుబ్బా నవ్వించాడీ అక్కినేని హీరో. త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం... సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. ఇపుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం ఈరోజు జరిగింది. అమల క్లాప్‌నివ్వగా నాగచైతన్య కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. నాగార్జున, రకుల్ ప్రీత్, సుశాంత్, రాహుల్ రవీంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
'చి.ల.సౌ'తో మెప్పించిన రాహుల్ రవీంద్రన్ 'మన్మథుడు 2'కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నాడు. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.