ETV Bharat / sitara

'మెగాస్టార్​- కొరటాల చిత్రంలో ఐటెం సాంగ్​ పక్కా' - koratala Siva

మెగాస్టార్​ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న 'ఆచార్య' చిత్రం గురించి కొత్త అప్​డేట్​ చెప్పారు సంగీత దర్శకుడు మణిశర్మ. సినిమాలో ఓ ఐటెం సాంగ్​, రొమాంటిక్​ సాంగ్​తో పాటు ఇద్దరూ హీరోలపై ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Manisharma gives crazy updates on Acharya's music
'చిరు సినిమాలో ఓ ఐటెం సాంగ్​ ఉంటుంది'
author img

By

Published : Jul 13, 2020, 6:01 AM IST

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ.. మెగాస్టార్​ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతోన్న 'ఆచార్య' చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత చిరు, మణిశర్మ కలయికలో చిత్రం రాబోతుంది. 'ఆచార్య' సినిమా గురించి కొత్త అప్​డేట్​ను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు స్వరకర్త మణిశర్మ.

చిరంజీవి కొత్త సినిమాలో ఒక ఐటెం సాంగ్​, ఇద్దరూ హీరోలతో మరొకటి, ఒక రొమాంటిక్​, ఎమోషనల్​, డాన్స్​ కోసం ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నామని మణిశర్మ తెలిపారు. బ్యాక్​గ్రౌండ్​ స్కోరుకు సినిమాలో మంచి ప్రాధాన్యం ఉంటుందని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

'ఆచార్య' చిత్రం ఇప్పటికే 40 శాతం షూటింగ్​ పూర్తి చేసుకుంది. ఆగస్టు నుంచి చిత్రీకరణను తిరిగి ప్రారంభించాలని చిత్రబృందం యోచిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో హీరోయిన్​గా కాజల్​ అగర్వాల్​ నటిస్తుంది. ఈ చిత్రంలో మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్ ఓ కీలకపాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.