క్యాన్యర్తో బాధపడుతున్న సమయంలో మనీషా కొయిరాలా తనకు ఎంతో సహాయపడిందని బాలీవుడ్ హీరోయిన్, క్యాన్సర్ బాధితురాలైన సొనాలీ బింద్రే చెప్పింది. ఆమె ఇచ్చిన సలహాలు వ్యాధిని ఎదుర్కొనేందుకు తోడ్పడ్డాయని తెలిపింది. బుధవారం బెంగళూరులో ఓ కార్యక్రమానికి హాజరైన సొనాలీ.. ఈ విషయాల్ని వెల్లడించింది.
"క్యాన్సర్తో బాధపడుతున్న సమయంలో మనీషా ఎంతగానో సహాయపడింది. ఎందుకంటే ఆమె ఆ బాధల్ని అనుభవించే వచ్చింది. దీనికి సంబంధించిన ఓ పుస్తకాన్ని రచించింది" - సొనాలీ బింద్రే, నటి
అదే విధంగా తన భర్త గోల్డీ భేల్ను అభినందించింది. ఈ వ్యాధిని ఎదుర్కొవడంలో అతడెంతో తోడ్పాటు అందించాడని సొనాలీ పేర్కొంది.
2012లో క్యాన్సర్కు గురైన మనీషా కొయిరాలా.. పలు రకాల చికిత్సల అనంతరం 2014లో ఆ వ్యాధి నుంచి బయటపడింది.