భారీ తారాగణంతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మిస్తున్న వెబ్ సిరీస్ 'నవరస'(Navarasa Trailer). శాంతం, కరుణ, రౌద్రం, భయానకం.. ఇలా నవరసాల నేపథ్యంలో తొమ్మిది భాగాలుగా రూపొంది ఈ సిరీస్. మంగళవారం ఈ సిరీస్ ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. టైటిల్‌కు తగ్గట్టుగానే అన్ని రకాల భావోద్వేగాలతో ఆద్యంతంగా ఆసక్తిగా సాగింది ఈ ట్రైలర్. ప్రతీ నటుడు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అందరి లుక్స్ చాలా కొత్తగా ఉన్నాయి. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. అగ్ర తారలందరినీ ఒకే వీడియోలో చూస్తుండటం కొత్త అనుభూతిని పంచుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ సిరీస్‌లో ఒక్కో భాగాన్ని ఒక్కో దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. సూర్య, సిద్ధార్థ్, ప్రకాశ్‌రాజ్, విజయ్ సేతుపతి, రేవతి, ఐశ్వర్యరాజేశ్, అరవింద్ స్వామి, రోబో శంకర్, యోగిబాబు, అంజలి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు 6 నుంచి ప్రముఖ ఓటీటీ 'నెట్‌ఫ్లిక్స్' వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
ఈ సిరీస్‌ను మరో దర్శకుడు జయేంద్రతో కలిసి నిర్మిస్తున్నారు మణిరత్నం. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ కార్మికులను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ సిరీస్ రూపుదిద్దుకుంది. రతీంద్రన్ ఆర్. ప్రసాద్, అరవింద్ స్వామి, బిజోయ్ నంబియార్, గౌతమ్ వాసుదేవ మేనన్, సర్జున్ కె.ఎం, ప్రియదర్శన్, కార్తీక్ నరేన్, కార్తీక్ సుబ్బరాజ్, వసంత్ ఈ తొమ్మిది కథలకు దర్శకత్వం వహించారు.
ఇదీ చూడండి: 'బాలయ్యతో సినిమా అనగానే భయపడ్డా'