విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇందులో 'ఎఫ్3', 'దృశ్యం 2' రీమేక్‌తో పాటు 'నారప్ప' ఉన్నాయి. అయితే 'నారప్ప'కు సంగీతమందిస్తున్న మణిశర్మ.. సృజనాత్మక విభేదాల కారణంగా తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
ఇంతకీ ఏమైంది?
తమిళ హిట్ 'అసురన్'కు తెలుగు రీమేక్ 'నారప్ప'. వెంకటేశ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. గతేడాది థియేటర్లలోకి రావాల్సినప్పటికీ కొవిడ్ కారణంగా వాయిదా పడింది.
గత డిసెంబరులో సినిమా గ్లింప్స్ విడుదలవగా, ఒరిజినల్ సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ స్కోరు అందులో ఉండటం వల్ల కాపీ కొట్టారంటూ మణిశర్మపై విమర్శలు వచ్చాయి. తన ట్యూన్ కాకుండా మాతృకలోనిది పెట్టడం వల్ల అప్పటి నుంచి మణిశర్మ, చిత్రబృందంపై అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా సినిమా నుంచే తప్పుకున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిలో నిజమెంతో తెలియాల్సి ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">