ETV Bharat / sitara

ప్రకాశ్​రాజ్ ప్యానెల్ రాజీనామాలు అందలేదు: విష్ణు - maa elections news

'మా' అధ్యక్షుడిగా అన్ని విధాల కృషి చేస్తానని మంచు విష్ణు అన్నారు. ప్రకాశ్​రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలు తనకు ఇంకా అందలేదని తెలిపారు.

manchu vishnu
మంచు విష్ణు
author img

By

Published : Oct 18, 2021, 11:07 AM IST

Updated : Oct 18, 2021, 1:17 PM IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ 'మా' ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు ప్రకటించారు. 'మా' నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ఇప్పుడు దీనిపై స్పందించారు. తన తండ్రి మోహన్‌బాబు, ప్యానెల్‌ సభ్యులతో కలిసి ఆయన సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

మంచు విష్ణు

"మా' ఎన్నికల్లో విజయం సాధించి.. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నికల్లో నా ప్యానెల్‌ ఎంతో కష్టపడింది. స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అసోసియేషన్‌ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తాను. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు రాజీనామాలు చేశారని.. మీడియా ద్వారానే తెలిసింది. వాళ్ల రాజీనామా లేఖలు ఇంకా మాకు అందలేదు. రాజీనామా లేఖలు అందాక ఆ విషయంపై స్పందిస్తాను' అని విష్ణు అన్నారు.

manchu vishnu panel
తిరుపతిలో మంచు విష్ణు ప్యానెల్

"అందరి కృషితోనే నాకు ఓట్లు వ్చచాయి. ఈ గెలుపు మా ప్యానెల్ సభ్యులందరిది. ఏ పోటీలో అయినా గెలుపోటములు సహజం. ఇప్పుడు మేం గెలిచాం.. మరోసారి వేరేవాళ్లు గెలవచ్చు. మా కృషి, పట్టుదలకు నిదర్శనమే విజయం. పోస్టల్​ బ్యాలెట్​లో మా ప్యానెల్​కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఎవరి రాజీనామాలు మాకు అందలేదు. మీడియా ద్వారానే ఆ అంశం వింటున్నాం. మోహన్​బాబు, చిరంజీవి మాట్లాడుకున్నారు. పవన్​ కల్యాణ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. ప్రకాశ్​రాజ్, నాగబాబు సభ్యత్వాల రద్దు మేం ఆమోదించలేదు. చాలా విషయాల్లో 'మా'బైలాస్ మారుస్తాం. సభ్యత్వాల విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తాం. పోటీ చేసే అభ్యర్థుల అర్హతలు మార్చే ఉద్దేశం లేదు. ఒకటీ రెండు సినిమాల్లో నటించిన వారికీ సభ్యత్వం ఇచ్చారు" అని విష్ణు అన్నారు.

manchu vishnu
మంచు విష్ణు ప్రకాశ్​రాజ్

అక్టోబర్‌ 10న జరిగిన 'మా' ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ సిని'మా' బిడ్డలం నుంచి గెలిచిన 11 మంది సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. 'మా' సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 18, 2021, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.