ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శివశంకర్ (Shiva Shankar Master Health) మాస్టర్ గురించి నటుడు, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు ట్వీట్ చేశారు. శివశంకర్ మాస్టర్ చికిత్స పొందుతున్న ఏఐజీ ఆస్పత్రి బృందంతో తాను ఫోన్లో మాట్లాడినట్లు విష్ణు తెలిపారు.
"ఏఐజీ ఆస్పత్రి బృందంతో మాట్లాడాను. శివశంకర్ (Sivasankar Master) మాస్టర్ కోలుకునేందుకు అన్ని విధాలుగా చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం కోసం వైద్యులు ఎంతగానో శ్రమిస్తున్నారు. మాస్టర్ రెండో కుమారుడు అజయ్‌తోనూ ఫోన్లో మాట్లాడాను. ఇప్పుడు ఆయన కుటుంబానికి మీ ప్రార్థనలు ఎంతో అవసరం" అని విష్ణు ట్వీట్ చేశారు.
ధనుష్ ఆర్థిక సాయం
ఆస్పత్రి బిల్లులు చెల్లించడంలో శివశంకర్ మాస్టర్ కుటుంబసభ్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న కోలీవుడ్ సూపర్‌స్టార్ ధనుష్ (Dhanush News).. తన వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం చేశారు. శివశంకర్ కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నటుడు సోనూసూద్ కూడా ఆర్థిక సాయం అందిస్తానని గురువారం ప్రకటించారు.
కరోనా బారిన పడి నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో శివశంకర్ మాస్టర్ చికిత్స (Shiva Shankar Master Health Condition) పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన సతీమణి, పెద్ద కుమారుడికి కూడా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన కుమారుడు అపస్మారక స్థితిలో ఉండగా.. సతీమణి హోం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు.
ఇదీ చూడండి: శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం