ETV Bharat / sitara

'నా దృష్టిలో ఎంజాయ్​మెంట్​ అంటే అదే!' - మోసగాళ్లు

సంప్రదాయలకు ఎక్కువగా గౌరవమివ్వడం వల్లే తాను పార్టీలకు దూరంగా ఉంటానని అంటున్నారు కథానాయకుడు మంచు విష్ణు. తన దృష్టిలో ఎంజాయ్​మెంట్​ అంటే పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం వంటివేనని 'మెసగాళ్లు' సినిమా ప్రమోషన్స్​లో వెల్లడించారు.

Manchu Vishnu about his relationship with Lakshmi and Manoj
'నా దృష్టిలో ఎంజాయ్​మెంట్​ అంటే అదే!'
author img

By

Published : Mar 14, 2021, 1:36 PM IST

Updated : Mar 14, 2021, 1:50 PM IST

తాను సంప్రదాయాలను ఎక్కువగా గౌరవిస్తుంటానని నటుడు మంచు విష్ణు తెలిపారు. అందుకే పార్టీలకు దూరంగా ఉంటానని చెప్పారు. తన తదుపరి చిత్రం 'మోసగాళ్లు' ప్రమోషన్‌లో పాల్గొన్న విష్ణు తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు పంచుకున్నారు.

"లక్ష్మి, నేను, మనోజ్‌.. మా ముగ్గురిలో సంప్రదాయాలకు నేనే ఎక్కువగా విలువ ఇస్తుంటాను. పెద్దా, చిన్నా అనే పద్ధతులు నమ్ముతుంటాను. నేను కొంచెం బోరింగ్‌ పర్సన్‌. రాత్రి త్వరగా నిద్రపోవడం. ఉదయాన్నే నిద్రలేవడం.. ఇలా ఉంటుంది నా లైఫ్‌స్టైల్‌. కానీ వాళ్లిద్దరి లైఫ్‌స్టైల్‌ వేరేలా ఉంటుంది. వాళ్లిద్దరి ఆలోచనలు కొంచెం కలుస్తుంటాయి. దాంతో వాళ్లిద్దరూ స్నేహితులు, పార్టీలతో ఎంజాయ్‌ చేస్తుంటారు. నా దృష్టిలో ఎంజాయ్‌మెంట్‌ అంటే పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, పిల్లలతో సమయాన్ని గడపడం."

- మంచు విష్ణు, కథానాయకుడు

అనంతరం మనోజ్‌కు ఏమైనా సలహాలు ఇస్తుంటారా? అని విలేకరి ప్రశ్నించగా.. "లేదు. అడక్కుండా సలహాలిస్తే ఆ మాటకు విలువ ఉండదు. అలాగే సలహాలిచ్చే వ్యక్తికి కూడా గౌరవం ఉండదు.. అనే దాన్ని ఎక్కువగా నమ్ముతుంటాను. అవసరమైనప్పుడు అడుగుతారు. అడిగితే తప్పకుండా ఇస్తాను" అని ఆయన తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం 'మోసగాళ్లు'. కాజల్‌-మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో నటించారు. జెఫ్రీ గీ చిన్‌ దర్శకుడు. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కీలకపాత్ర పోషించారు. నవ్‌దీప్‌, నవీన్‌చంద్ర తదితరులు నటించారు. అలాగే, ఈ సినిమాలో విష్ణుకు అక్కగా కాజల్‌ కనిపించనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు మృతి

Last Updated : Mar 14, 2021, 1:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.