ETV Bharat / sitara

ఆ చిన్నారులకు మంచు లక్ష్మి సాయం

కరోనా కాలంలో చిన్నారుల విద్య, వైద్యం సహా కనీస అవసరాలను తీర్చేందుకు నటి మంచు లక్ష్మీప్రసన్న ముందుకొచ్చింది. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు ఈ అవసరాలను తీర్చేందుకు ఆమె 'టీచ్‌ ఫర్‌ చేంజ్‌' సంస్థతో చేతులు కలిపింది. ఈ సంస్థ ద్వారా దాదాపు 1000 చిన్నారులను సహాయపడనున్నారు.

Manchu Lakshmi helping kids who have lost parents due to Covid-19
ఆ చిన్నారులకు మంచు లక్ష్మి సాయం
author img

By

Published : May 21, 2021, 5:32 AM IST

Updated : May 21, 2021, 9:43 AM IST

ప్రస్తుతం దేశంలో కరోనా రెండో దశతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొవిడ్‌ బారినపడి ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి. కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లల కోసం తెలుగు నటి మంచు లక్ష్మీ ప్రసన్న సాయం చేయడానికి ముందుకొచ్చింది. ఆమె 'టీచ్‌ ఫర్‌ చేంజ్‌' అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి 1000 పిల్లలకు విద్య, వైద్యం, ప్రాధమిక అవసరాలను తీర్చేందుకు సహాయం అందిస్తోంది.

  • Can you imagine the torment a child is going through when he/she loses a parent to covid-19? Do you know anyone who has lost their parents? Imagine the adverse effects that can be caused on child's growth and mental health because of Parental loss? pic.twitter.com/6uMPA1SXIE

    — Lakshmi Manchu (@LakshmiManchu) May 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"వ్యక్తిగతంగా ఇప్పటికే ఎంతో మందికి సహాయం చేస్తున్నాను. ఆసుపత్రిలో పడకలతో పాటు మందులులాంటివి అందించేందుకు సాయం చేస్తున్నాం. కొవిడ్‌ ప్రభావంతో ఎన్నో కుటుంబాలు తమ తల్లితండ్రులను పొగొట్టుకున్నాయి. మేం టీచ్‌ ఫర్‌ చేంజ్‌తో తక్కువ ఆదాయ ఆదాయంగల కుటుంబాలను గుర్తించి 1,000 మంది పిల్లలకు విద్య, ట్యూషన్, బట్టలతో పాటు ఇతర సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇటీవల లాక్‌డౌన్‌ ప్రారంభమైంది. హైదరాబాద్‌కు వైద్యం కోసం చాలా మంది వేరే ఊర్ల నుంచి ఇక్కడికి వస్తుంటారు. అలాంటి వారికి ఆహారం దొరకడం చాలా కష్టతరం. ఈ లాక్‌డౌన్‌ మొత్తం సమయంలో 1000 భోజనాలు పంపిణీ చేసేందుకు కొన్ని ఆసుపత్రులను ఎంచుకున్నాము. వారి కోసం టీచ్ ఫర్‌ చేంజ్‌ బృందం, మా వాలంటీర్స్ తో పాటు బృంద సభ్యులు ప్రతిరోజూ వారికి ఆహారం ఇచ్చి ఆకలిని తీర్చినందుకు ధన్యవాదాలు" అని మంచు లక్ష్మి తెలిపింది.

ఇదీ చూడండి.. ఈ హైదరాబాదీ సుందరి రూటే సెపరేటు!

Last Updated : May 21, 2021, 9:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.