టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, మోహన్‌బాబుకి మధ్య ఎలాంటి గొడవల్లేవని.. ప్రముఖ నటి, మోహన్‌బాబు కుమార్తె మంచులక్ష్మి స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఇన్‌స్టా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ సంవత్సర ఆరంభ నెల జనవరిలో ఆమె సంతోషానికి గురైన అన్ని సంగతులనూ అందులో పేర్కొంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"ఈ ఏడాదిలోని మొదటి నెల నేటితో పూర్తి కానుంది. కొత్త దశాబ్దం.. కొత్త ఏడాది.. నాన్న, చిరు అంకుల్ ఆలింగనం చేసుకున్న ఫొటోలతో చాలా అద్భుతంగా ప్రారంభమైంది. ఇంటర్నెట్‌లో ఆ ఫొటోలు విపరీతంగా చక్కర్లు కొట్టాయి. అసలు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఆ ఫొటోలు చూడగానే నాకెంతో సంతోషంగా అనిపించింది. వీరిద్దరి మధ్య గొడవలున్నాయని చాలామంది అనుకున్నారు. కానీ, తాజాగా వారిద్దరు సన్నిహితంగా మెలిగిన క్షణం చాలా బాగుంది. వారాంతరాల్లో వాళ్లు మా ఇంటికి, మేము వాళ్లింటికి వెళ్తుండేవాళ్లం. నాన్న, చిరు అంకుల్ ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. వాటిల్లో చాలా షూటింగ్‌లు ఎక్కువగా ఊటీలో చిత్రీకరించడం వల్ల మా రెండు కుటుంబాలు వేసవి సెలవులు అక్కడే ఎంజాయ్ చేసేవాళ్లం. ఒకవేళ వాళ్ల మధ్య తగాదాలు, గొడవలు ఉంటే కలిసి అన్ని సినిమాల్లో నటించేవాళ్లు కాదు. నాకు తెలిసి వాళ్లిద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉండేది. కాబట్టి అభిమానులూ ప్రతి ఒక్కరినీ అభిమానించండి. గొడవలు పడకండి"
-మంచు లక్ష్మీ, సినీ నటి
ఇందులో భాగంగా 'మా' డైరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోహన్‌బాబు-చిరంజీవి ఆలింగనం చేసుకున్న ఓ ఫొటోను సామాజిక మాధ్యమం ద్వారా షేర్ చేసింది.
ఇదీ చూడండి... 'దిశ' హత్యాచార ఘటనపై ఆర్జీవీ సినిమా