ETV Bharat / sitara

Accident Case: నటుడి కారు ఢీకొని వ్యక్తి మృతి - రజత్ బేడీ న్యూస్

ప్రముఖ నటుడి కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఆ నటుడికి రెండేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Rajat Bedi News
రజత్ బేడీ
author img

By

Published : Sep 8, 2021, 7:42 PM IST

బాలీవుడ్​ నటుడు రజత్ బేడీ(rajat bedi now) చేసిన యాక్సిడెంట్​ వల్ల ఓ వ్యక్తి మరణించారు. తొలుత ఆ వ్యక్తికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రిలో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ జరిగింది..

సోమవారం సాయంత్రం తన పని ముగించుకుని రజత్ బేడీ ఇంటికి వెళ్తున్నారు. అంధేరీలోని ఓ గుడి దగ్గర కార్మికుడు ఒకరు అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చారు. దీంతో బ్రేక్​లు వేసిన లాభం లేకుండా పోయింది. దీంతో ఆ వ్యక్తిని కారు ఢీకొట్టింది. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న అతడు.. బుధవారం సాయంత్రం మరణించారు.

యాక్సిడెంట్​ చేసినందుకుగానూ రజత్​ బేడీపై(Rajat Bedi News) సెక్షన్ 279, 338 కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆ వ్యక్తి మరణంతో 304-ఏ సెక్షన్ కూడా ఎఫ్​ఐఆర్​లో జోడించినట్లు పోలీసులు తెలిపారు. ఫలితంగా రజత్​కు రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా రజత్​ బేడీని అరెస్టు చేయలేదని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.