ఆసు యంత్రం సృష్టికర్త, చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం బయోపిక్ ‘మల్లేశం’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసింది. తెలంగాణ మాండలికంలో ఉన్న డైలాగ్లతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది. జూన్ 21 ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేటర్లలోకి తేనున్నారు.
మల్లేశం పాత్రలో ‘పెళ్లి చూపులు’ ఫేమ్ ప్రియదర్శి నటించాడు. ఝాన్సీ, అనన్య సహాయ పాత్రల్లో నటించారు. రాజ్.ఆర్ సినిమాకు దర్శకత్వం వహించగా.. మార్క్.కె.రాబిన్ సంగీతం అందించాడు.
![mallesham cinema poster](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3416783_malllesham.jpg)
తెలంగాణలో యాదాద్రి జిల్లా ఆలేరు మండలం శారాజీపేటకు చెందిన చింతకింది మల్లేశం తన తల్లి కష్టాన్ని చూడలేక.. ఏడేళ్ల పాటు శ్రమించి ఆసు యంత్రాన్ని కనిపెట్టారు. 2011లో దానిపై పేటెంట్ హక్కు పొందారు. అదే ఏడాది ఫోర్బ్స్ జాబితాలోనూ ఆయనకు చోటు దక్కింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">