ETV Bharat / sitara

దుబాయ్​లో ఇల్లు కొన్న మలయాళ సూపర్​స్టార్​ - దుబాయ్​లో ఇల్లు కొన్న మోహన్​లాల్​

దుబాయ్​ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో మలయాళ సూపర్​స్టార్​ మోహన్​లాల్​ ఓ ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్​గా మారాయి.

Malayali Super Star Mohanlal buys new flat in Dubai
దుబాయ్​లో ఇల్లు కొన్న మలయాళీ సూపర్​స్టార్​
author img

By

Published : Nov 20, 2020, 9:23 AM IST

మలయాళీ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ తాజాగా దుబాయ్‌లో ఓ ఖరీదైన నివాసాన్ని కొనుగోలు చేశారు. దుబాయ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి చేరువలో డౌన్‌టౌన్‌లోని ఆర్పీ హైట్స్‌లో అన్ని సదుపాయాలతో కూడిన ఓ ఇంటిని ఆయన తీసుకున్నారు. ఆయన బాల్య స్నేహితుడు డైరెక్టర్‌ అశోక్‌కుమార్‌ ఈ ఇంటిని సందర్శించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

Malayali Super Star Mohanlal buys new flat in Dubai
స్నేహితులతో మోహన్​లాల్​

గత కొన్నిరోజుల క్రితం 'దృశ్యం-2' షూటింగ్‌ను పూర్తి చేసుకున్న మోహన్‌లాల్‌ హాలీడేలో భాగంగా ఇటీవల కుటుంబసభ్యులతో కలిసి దుబాయ్‌కి వెళ్లారు. ఈ ఏడాది దీపావళి వేడుకలను బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ కుటుంబసభ్యులతో కలిసి అక్కడే జరుపుకొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.