ETV Bharat / sitara

బిహార్​లో స్కూల్​ టీచర్​గా అనుపమ! - బిహార్​ టెట్​

ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ బిహార్‌లో టెట్ పరీక్ష రాసింది! మంచి మార్కులతో ఆమె ఉత్తీర్ణత సాధించింది. ప్రస్తుతం అనుపమ టెట్ మార్కుల ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదేంటి కేరళ బ్యూటీ.. బిహార్​లో టెట్​ రాయడమేంటి అనుకుంటున్నారా! ఇదంతా అధికారుల తప్పిదం వల్ల జరిగిందే. అసలేమైందంటే..?

Anupama Paremeshwaran
అనుపమ
author img

By

Published : Jun 25, 2021, 1:19 PM IST

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.. బిహార్​లో ఉపాధ్యాయురాలు కావడమేంటి? ఆమె సినిమాలకు గుడ్​బై చెప్పి.. టీచర్‌గా అవతారమెత్తనుందా? అని ఆశ్చర్యపోకండి. అయినా కేరళ బ్యూటీ.. బిహార్​లో టెట్​ ఎలా రాస్తుంది? ఇదంతా అధికారులు చేసిన తప్పిదం వల్ల జరిగిందే.

అసలు ఏమైందంటే..?

బిహార్‌లోని జహానాబాద్‌కు చెందిన రిషికేశ్ కుమార్​ అనే యువకుడు ఇటీవల స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (STET) రాశాడు. దానికి సంబంధించి.. మంగళవారం విడుదలైన ఫలితాల్లో అతడికి మంచి మార్కులే(77 శాతం మార్కులు) వచ్చాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ మార్క్ షీట్‌లో రిషికేశ్ ఫొటో లేదు. తన ఫొటోకు బదులు అనుపమ పరమేశ్వరన్ ఫొటో ఉంది. ఇది చూసి అతను ఒక్కసారి షాకయ్యాడు. దీంతో అధికారులకు ఫిర్యాదు చేశాడు.

అప్పుడే చెప్పినా..

"ఇదే తొలిసారి కాదు. అడ్మిట్​కార్డులోనే ఆమె ఫొటో వచ్చింది. ఆ విషయాన్ని అప్పుడే అధికారులకు తెలియజేశాను. ఆ పొరపాటును సరిచేస్తామని చెప్పారు. దాంతో అదే అడ్మిట్​కార్డుతో పరీక్ష రాశాను. ఫలితాలు వచ్చినప్పటికీ ఆ ఫొటో అలానే ఉంది. ఎలాంటి మార్పులు చేయకుండా అధికారులు ఫలితాలను విడుదల చేశారు."

- రిషికేశ్​ కుమార్​, బాధితుడు

ఈ ఘటనపై విచారించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్​ కుమార్​ తెలిపారు.

అప్పుడు సన్నీ.. ఇప్పుడు అనుపమ

ఈ ఘటనపై ఆర్​జేడీ నేత తేజశ్వి యాదవ్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.

  • सनी लियोनी को बिहार की जूनियर इंजीनियर परीक्षा में टॉप कराने के बाद अब मलयालम अभिनेत्री अनुपमा परमेश्वरन को #STET परीक्षा पास करवा दी है।

    नीतीश जी हर परीक्षा-बहाली में धाँधली करा करोड़ों युवाओं का जीवन बर्बाद कर रहे है। एक बहाली पूरा करने में एक दशक लगाते है वह भी धाँधली के साथ। https://t.co/1QJQ8ulqQ2

    — Tejashwi Yadav (@yadavtejashwi) June 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"బిహార్​ జూనియర్ ఇంజనీర్​​ పరీక్షలో సన్నీ లియోనీ​ అగ్రస్థానంలో నిలిచారు. ఇప్పుడు మలయాళ నటి అనుపమ పరమేశ్వరన్.. ఎస్​టీఈటీలో ఉత్తీర్ణత సాధించారు. ప్రతి పరీక్షలోనూ తప్పులు చేయడం ద్వారా కోట్లాది మంది యువత జీవితాలను నితీశ్​ నాశనం చేస్తున్నారు" అంటూ.. ఆ పార్టీనేత రితు జైస్వాల్​ ట్వీట్​ను రీట్వీట్​ చేశారు యాదవ్.

2019లో బిహార్ ప్రభుత్వం నిర్వహించిన జూనియర్ ఇంజనీరింగ్ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచిన ఓ అభ్యర్థికి బదులు.. సన్నీలియోనీ ఫొటోతో అధికారులు ఫలితాలు విడుదల చేయడం అప్పట్లో వైరల్​గా మారింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ తప్పును సరిచేశారు. అలాంటి సంఘటనే మళ్లీ రాష్ట్రంలో జరగడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఇదీ చూడండి: MAA Election: 'మాది సినిమా బిడ్డల ప్యానల్‌... పదవి కోసం పోటీ చేయడం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.