ETV Bharat / sitara

కొవిడ్-19 రిపోర్టు బయటపెట్టిన ఆ హీరో - మలయాళ హీరో పృథ్వీరాజ్

ఇటీవలే జోర్డాన్ నుంచి తిరిగొచ్చిన మలయాళ నటుడు పృథ్వీరాజ్.. తన కొవిడ్-19 పరీక్షలకు సంబంధించిన రిపోర్టును ఇన్​స్టాలో పంచుకున్నాడు.

కొవిడ్-19 రిపోర్టులు బయటపెట్టిన ఆ హీరో
మలయాళ నటుడు పృథ్వీరాజ్
author img

By

Published : Jun 3, 2020, 7:33 PM IST

విదేశాల్లో చిత్రీకరణ ముగించుకుని​, ఇటీవలే కేరళకు తిరిగొచ్చిన మలయాళ ప్రముఖ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్​​కు వైద్యపరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఇన్​స్టాలో వెల్లడించి, రిపోర్టును పోస్ట్ చేశాడు.

'అదు జీవితం' అనే సినిమా షూటింగ్​ కోసం పృథ్వీరాజ్, దర్శకుడు బ్లెస్సీతో సహా 58 మంది మార్చి 12న జోర్డాన్​ వెళ్లారు. అనంతరం కరోనా లాక్​డౌన్​తో అక్కడే చిక్కుకుపోయారు. గతనెల చివర్లో ప్రత్యేక విమానంలో కేరళ చేరుకున్నారు. వచ్చిన తర్వాత వారం రోజులు క్వారంటైన్​లో ఉన్న పృథ్వీరాజ్.. ఇటీవలే పరీక్షలు చేయించుకున్నాడు. తనకు నెగిటివ్ వచ్చినా సరే.. మరికొన్నిరోజులు ఇంట్లోనే ఉంటానని చెప్పుకొచ్చాడు.

ఈ మధ్య కాలంలో వచ్చిన 'డ్రైవింగ్ లైసెన్స్', 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నాడు పృథ్వీరాజ్. ఇవి ప్రేక్షకాదరణ పొంది, వసూళ్లు బాగానే సాధించాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.