ETV Bharat / sitara

లాక్​డౌన్​ వేళలో సినిమా తీయండి.. పాపులర్ అవ్వండి​ - ఇన్నోవేటివ్​ లాక్​డౌన్​ స్టోరీలు

లాక్​డౌన్​తో విసుగు చెందుతున్నారా.. ఏం చేయాలో అర్థం కావడం లేదా.. అయితే ఇంకెందుకు ఆలస్యం మీలోని ప్రతిభను బయట పెట్టేయండి. నిమిషం నిడివి ఉండే ఓ సందేశాత్మక సినిమాను మొబైల్​లో తీసి పంపించండని అంటున్నారు బాలీవుడ్ దర్శకనిర్మాతలు.

Make a one-minute film, beat lockdown blues
లాక్​డౌన్​ వేళలో డైరెక్టర్ అయ్యే అద్భుత అవకాశం​
author img

By

Published : Apr 17, 2020, 2:34 PM IST

లాక్​డౌన్​లో విసుగు చెందుతున్న వారికి బాలీవుడ్​ దర్శకనిర్మాతలు ఓ గొప్ప అవకాశం ఇచ్చారు. 'ఇండియా లెట్స్​ మేక్​ ఏ ఫిల్మ్​' పేరుతో నిమిషం నిడివి ఉండే మొబైల్ ఫిలిమ్స్ తీయాలని ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు బాలీవుడ్​ ప్రముఖులు ఏక్తా కపూర్​, ఆనంద్​ ఎల్​ రాయ్​, సాజిద్​ నాడియాద్వాలా, దినేష్​ విజన్, నితీశ్​ తివారీ, మహావీర్​ జైన్​ ముందుకొచ్చారు. వీరి ఈ ఆలోచనకు ముఖేశ్​ ఛబ్రా, మోంటూ బస్సీ, మౌలిక్​ భగత్​ ప్రచారం చేస్తున్నారు.

నిమిషంలో ఈ అంశాలపై..

కేవలం నిమిషంలో సినిమా తీసి పంపేందుకు ఎంట్రీలను ఆహ్వానిస్తున్నారు. ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు కొన్ని ముఖ్యమైన అంశాలపై మొబైల్​లో సినిమా తీయాలని నిర్ణయించారు. అవి..

1. ది గుడ్​ సైడ్​ ఆఫ్ క్వారంటైన్​

2. హమ్​ హోంగే కామ్యాబ్​

3. ఆసక్తికరమైన/సృజనాత్మక లాక్​డౌన్​ కథలు

4. భద్రతా ప్రమాణాలు పాటించడం, సహాయం, సంరక్షణ, లాక్​డౌన్​ సమయంలో ఆందోళనలు

5. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో పోరాడుతున్న నిజమైన హీరోలకు కృతజ్ఞతలు తెలుపుతూ..

పై అంశాలను ఎంచుకుని సినిమా తీయాలని సూచించారు. ఎంట్రీలను ఈనెల 21 లోపు పంపించాలని తెలిపారు. వీటిలో గెలిచిన వారి సినిమాలను సోషల్​ మీడియాలో విడుదల చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి: గౌతమ్​తో కలిసి గేమ్ ఆడుతున్న మహేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.