ETV Bharat / sitara

ఆయన కళ్లు బాగా ఆకర్షించాయి.. అలా 'మేజర్' తీస్తున్నాం! - major cinema mahesh babu

'మేజర్​' సినిమాకు సంబంధించిన ప్రత్యేక వీడియోను హీరో మహేశ్​బాబు ట్వీట్ చేశారు. ఇందులో మేజర్ సందీప్ పాత్రధారి అడివి శేష్.. చిత్రవిశేషాలను పంచుకున్నారు.

'Major' Beginnings.. 'The Look' Test.. Adivi Sesh
మేజర్​ సందీప్ ఉన్నికృష్ణన్ అడివి శేష్
author img

By

Published : Nov 27, 2020, 12:00 PM IST

26/11 దాడుల్లో వీరమరణం చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్​ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా 'మేజర్'. పాన్ ఇండియా స్థాయిలో తీస్తున్న ఈ చిత్రంలో అడివి శేష్ టైటిల్​ రోల్ పోషిస్తున్నారు. ఉగ్రదాడులు జరిగి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'మేజర్ బిగినింగ్స్' పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు. మేజర్​ సందీప్ జీవితాన్ని సినిమాగా తీయాలనే ఆలోచన ఎలా కలిగింది? ఎలా మొదలైంది తదితర విషయాల్ని శేష్ పంచుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"ఏం చెప్పాలి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అంటే.. ఆయన నన్ను ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేశారని చెప్పాలా? ఇన్​స్పైర్​ చేశారు అని చెప్పాలా? మేజర్ సందీప్ నా మైండ్​లో 2008 నుంచి ఉన్నారు. 26/11 ఎటాక్స్​ జరిగినప్పుడు నేను శాన్​ఫ్రాన్సిస్కోలో ఉన్నాను. ఇండియన్​ ఛానెల్స్​లో 27వ తేదీ మధ్యాహ్నం ఆయన ఫొటో వేశారు. ఎవరు ఈయన అని అనుకున్నాను. ఆయనను చూడగానే నాకు అన్నయ్యలా అనిపించారు. ముఖ్యం ఆ ఫొటోలో కళ్లలో ఓ ఫ్యాషన్​ ఉంది, ఓ మ్యాడ్​నెస్​ ఉంది. ఓ స్పిరిట్ ఉంది. ఆయన ఎవరు ఏంటి అని తెలుసుకోవాలనిపించింది. డిఫరెంట్ యానివర్సీస్​లో పేపర్​ క్లిప్పింగ్స్, ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు అవన్నీ కట్​ చేసుకుని కంప్యూటర్​లో సేవ్​ చేసుకుని చూసుకుంటూ ఉండేవాడిని. అది తెలుసుకోవడంలో పదేళ్ల అయిపోయింది. ఈ కాలంలో ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. ఆయన లైఫ్​పై ఇంట్రస్ట్ ఉండేది కానీ ఆయన పేరెంట్స్​ను కాంటాక్ట్​ చేసే ధైర్యం ఎప్పుడు రాలేదు. ఫైనల్​గా పాన్​ ఇండియా స్థాయిలో సందీప్​ కథను చెప్పగలను అని ధైర్యం వచ్చినప్పుడు ఆయన పేరెంట్స్​ను కలిశాను. మిస్టర్ ఉన్నికృష్ణన్, సందీప్ వాళ్ల ఫాదర్. ఆయన నన్ను నమ్మలేదు. అలా కొన్నాళ్లకు 10 శాతం నమ్మారు. అప్పుడు ఆనందం, బాధ రెండు అనిపించాయి. జీరో నుంచి 10 వరకు వచ్చామని ఆనందం పడాలా? లేదా ఇంకా 10 శాతం దగ్గరే ఉన్నామని బాధపడాలో అర్ధం కాలేదు. సందీప్ ఐకానిక్ ఫొటో తీస్తున్నప్పుడు ఆయన గట్టిగా నవ్వారట. అలా కాదు నవ్వకూడదు అని ఫొటోగ్రాఫర్ చెబితే ఆయన ఫొటో దిగారు. అందులోని ఆయన కళ్లలో ఫ్యాషన్, మ్యాడ్​నెస్​, స్పిరిట్ నాకు బాగా నచ్చాయి. ఆ కళ్లు నన్ను బాగా ఆకర్షించాయి" అంటూ అడివి శేష్ చెప్పారు. దీనితో పాటే పలు విషయాల్ని పంచుకున్నారు.

ఈ సినిమాను సోనీ పిక్చర్చ్, సూపర్​స్టార్ మహేశ్​బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శోభిత హీరోయిన్​గా నటిస్తుండగా, 'గూఢచారి' ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబరు 17 ఫస్ట్​లుక్​ విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది వేసవికి సినిమాను థియేటర్లలో విడుదల చేసే అవకాశముంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.