ETV Bharat / sitara

శ్రావణి.. దోచింది నా హృదయాన్ని! - samantha in Majili Movie

నాగ చైతన్య, సమంత ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'మజిలీ'. భార్యాభర్తల మధ్య అనుబంధాలు, ప్రేమ గురించి హృదయాన్ని హత్తుకునేలా తెరకెక్కించాడు దర్శకుడు శివ నిర్వాణ. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా ఏడాది.

మజిలీ
మజిలీ
author img

By

Published : Apr 5, 2020, 6:01 PM IST

ఏం పిల్లరా బాబు వెళ్లట్లేదు మైండ్‌లో నుంచి..

'ఫిదా' సినిమాలో సాయి పల్లవి గురించి వరుణ్‌ తేజ చెప్పిన మాట ఇది.

ఏం పాత్రరా బాబు వదట్లేదు హృదయాన్ని..

'మజిలీ' చిత్రంలో సమంతను చూశాక కలిగిన భావం ఇది.

సినిమాల్లోని పాత్రలు చిత్రం విడుదలైన కొన్ని రోజుల వరకే గుర్తుంటాయి. మరికొన్ని నెలలు. ఇంకొన్ని సంత్సరాలు. కొన్ని మాత్రం చిరస్థాయిగా నిలుస్తాయి. గుండెలో గూడు కట్టుకుంటాయి. సమంత నటించిన 'శ్రావణి' పాత్ర ఈ కోవలోకి వస్తుంది.

'మజిలీ' సినిమాలో సమంత 'శ్రావణి' పాత్రలో నటించింది అనడం కంటే జీవించింది అనడం అతిశయోక్తి కాదేమో! టీజర్‌తోనే ఈ విషయాన్ని నిరూపించింది సామ్‌. వర్షంలో సిగరెట్‌ కాలుస్తున్న భర్త(నాగ చైతన్య)కు గొడుగు పట్టిన సన్నివేశంతో భార్య అంటే ఇలా ఉండాలని అందరితో అనిపించుకుంది. ప్రతి సన్నివేశంలోనూ తనదైన నటనతో ఆకట్టుకుంది సామ్‌.

"ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రాల్లో 'మజిలీ' ఒకటి. ఈ సినిమాకు గోపీ సుందర్‌ అందించిన సంగీతం అద్భుతం. 'ఏడెత్తు మల్లెలే' పాట ప్రతి రోజూ వింటాను. శివ నిర్వాణ దర్శకత్వం మెప్పించింది. గతేడాది ఏప్రిల్‌ 5న విడుదలైందీ చిత్రం. నాగ చైతన్య, సమంత పెళ్లి తర్వాత కలిసి నటించిన చిత్రమిది. నిజజీవితంలో ఎలా ఉంటారో వెండి తెరపైనా భార్యాభర్తలుగా అలరించారు. చైతూకి ఇష్టంలేకపోయినా అతణ్నే ఆరాధిస్తూ సామ్‌ చూపించిన ప్రేమ అనిర్వచనీయం. ఇలాంటి పాత్రలు అరుదుగా వస్తాయి. వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకుంటూ సమంత మరిన్ని మంచి పాత్రలు చేయాలని ఆశిస్తున్నాను."

-ఓ అభిమాని

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.