ETV Bharat / sitara

'వకీల్​సాబ్​'కు మహేశ్​బాబు ప్రశంసలు - 'వకీల్​సాబ్​'కు మహేశ్ ప్రశంసలు

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'వకీల్​సాబ్' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన సూపర్​స్టార్ మహేశ్​బాబు చిత్రబృందాన్ని ప్రశంసించారు.

Maheshbabu Praises Vakeelsaab team
'వకీల్​సాబ్​'కు మహేశ్ ప్రశంసలు
author img

By

Published : Apr 11, 2021, 6:42 AM IST

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన 'వకీల్‌ సాబ్‌' చిత్రంపై నటుడు మహేశ్‌బాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ మహేశ్‌ ట్విట్టర్​లో ప్రశంసించారు.

"వకీల్‌ సాబ్‌'లో లాయర్‌గా పవన్‌ కల్యాణ్‌ అద్భుతంగా నటించారు. పవన్‌ నటన చాలా శక్తివంతంగా ఉంది. ప్రకాశ్‌రాజ్‌ గొప్ప ప్రతిభాశాలి. నివేదా థామస్‌, అంజలి, అనన్యలు హృదయాన్ని హత్తుకునేలా నటించారు. తమన్‌ అందించిన సంగీతం సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. చిత్రబృందానికి అభినందనలు."

-మహేశ్‌బాబు ట్వీట్‌

వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన 'వకీల్‌ సాబ్‌' చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 9న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా అద్భుతంగా ఉందంటూ ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.