ETV Bharat / sitara

మహేశ్​-త్రివిక్రమ్​ కాంబో మరోసారి! - త్రివిక్రమ్​ న్యూస్​

'అతడు', 'ఖలేజా' కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. సూపర్​స్టార్​ మహేశ్​ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ కాంబోలో ఓ చిత్రం రూపొందనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్​ వర్క్​ జరుగుతుందని త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడవుతాయని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

Mahesh-trivikram combination that will entertain the audience once again!
మహేశ్​-త్రివిక్రమ్​ కాంబో మరోసారి!
author img

By

Published : Apr 9, 2020, 9:35 AM IST

టాలీవుడ్‌ క్రేజీ కాంబినేషన్లలో మహేశ్‌ బాబు, త్రివిక్రమ్‌ ప్రత్యేకంగా నిలుస్తారు. వీరిద్దరూ కలసి పనిచేసిన 'అతడు', 'ఖలేజా' చిత్రాలే దీనికి నిదర్శనం. త్రివిక్రమ్‌ మాటలు మహేశ్‌ నోటి వెంట వింటే సినీ అభిమానులకు పండగే. మరోసారి ఈ కాంబో సెట్‌ అవబోతుందని టాలీవుడ్‌లో ప్రచారం ఊపందుకుంది. పదేళ్ల తర్వాత మహేశ్‌ను తెరకెక్కించే ప్రయత్నంలో త్రివిక్రమ్‌ ఉన్నాడని టాక్‌.

Mahesh-trivikram combination that will entertain the audience once again!
మహేశ్​ బాబు, త్రివిక్రమ్​ శ్రీనివాస్​

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా చాలామంది దర్శకులు కథలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్‌ పలు స్క్రిప్టులు రాసుకున్నాడని, అందులో ఒకటి మహేశ్‌ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇంకా ఇది చర్చల దశలో ఉందని సమాచారం. అధికారిక ప్రకటన రావాలంటే కొంతకాలం వేచి చూడాలి. ఇప్పటికే జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఓ చిత్రం ప్రకటించాడు త్రివిక్రమ్‌. మహేశ్‌ వేరే ప్రాజెక్టు పనుల్లో ఉన్నాడు. ఇద్దరి సినిమాలు పూర్తయ్యాక కలిసి పనిచేస్తారేమో చూడాలి.

ఇదీ చూడండి.. 'దీపికా, కంగనాలతో పోటీపడతా అనుకోలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.