ETV Bharat / sitara

'సుశాంత్​ను వదిలేయమని రియాకు ఎప్పుడూ చెప్పలేదు' - mahesh bhatt latest news

సుశాంత్​ సింగ్ రాజ్​పుత్​​ ఆత్మహత్య కేసులో భాగంగా బాలీవుడ్​ నిర్మాత మహేశ్​ భట్​ను పోలీసులు విచారించారు. రియా చక్రవర్తికి సుశాంత్​ను వదిలేయమని తానెప్పుడూ చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. రాజ్​పుత్​ను వ్యక్తిగతంగా రెండు సార్లు మాత్రమే కలిసినట్లు భట్​ స్పష్టం చేశారు.

Mahesh Bhatt: Never asked Rhea to leave Sushant
మహేశ్​ భట్
author img

By

Published : Jul 29, 2020, 12:42 PM IST

బాలీవుడ్ హీరో సుశాంత్​ మృతి కేసుపై ముంబయి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. తాజాగా నిర్మాత మహేశ్​ భట్​ వాంగ్మూలాన్ని తీసుకున్నారు పోలీసులు. సుశాంత్​ను వదిలేయమని రియాకు తానెప్పుడూ చెప్పలేదని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.

సుశాంత్​ను తన జీవితంలో రెండు సార్లు మాత్రమే కలిసినట్లు మహేశ్​ భట్​ వెల్లడించారు. "నేను నెపోటిజానికి ఎప్పుడూ మద్దతివ్వను. చాలా మంది కొత్తవారికి నేను అవకాశాలను ఇచ్చాను. ఇక సుశాంత్​ను వ్యక్తిగతంగా రెండు సార్లు కలిశానంతే." అని మహేశ్​ భట్​ వివరించారు.

తను తెరకెక్కించిన 'సడక్​ 2' కొన్ని కారణాల వల్ల సుశాంత్​తో చేయడం కుదరలేదని మహేశ్​ తెలిపారు.

జూన్​ 14న సుశాంత్​ ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కొద్ది రోజుల తర్వాత రియా చక్రవర్తి.. 'దిల్​ బెచారా' నటుడితో తనకున్న సంబంధాన్ని సోషల్​ మీడియా వేదికగా ప్రకటిస్తూ.. ఈ కేసుపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్ర హోంమంత్రి అమిత్​షాను అభ్యర్థించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.