ETV Bharat / sitara

మహిళా దర్శకురాలితో మహేశ్​ సినిమా!

author img

By

Published : Feb 2, 2021, 3:22 PM IST

Updated : Feb 2, 2021, 4:32 PM IST

హీరో మహేశ్​బాబుతో సినిమా చేసే ప్రయత్నంలో ప్రముఖ దర్శకురాలు సుధ కొంగర ఉన్నారని తెలిసింది. ఇప్పటికే కథ సిద్ధం అవ్వగా.. చర్చలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

mahesh
మహేశ్​

'గురు' సినిమాతో దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు సుధ కొంగర. తమిళ నటుడు సూర్య కథానాయకుడిగా 'ఆకాశం నీ హద్దురా' చిత్రాన్ని తెరకెక్కించి మరో హిట్​ను సొంతం చేసుకున్నారు. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లే సాధించింది.

ప్రస్తుతం ఈమె సూపర్​స్టార్​ మహేశ్​బాబు కోసం ఓ కథ తయారు చేశారని తెలిసింది. దీనిపై చర్చలు జరుగుతున్నాయని సినీ వర్గాల టాక్​. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

అంతకముందు 'ఆకాశం నీ హద్దురా' చిత్రాన్ని చూసి మహేశ్​ మెచ్చుకున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్నారు మహేశ్​. ఈ సినిమా పూర్తవ్వగానే సుద కొంగరతోనే సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.

లాక్‌డౌన్‌ సమయంలో సుధ కొంగర పరువు హత్యల నేపథ్యంలో 'పావ కథైగల్' వెబ్​సిరీస్​ను ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మేనన్‌, వెట్రిమారీ, విఘ్నేష్ శివన్​తో కలిసి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ పాజిటివ్​ టాక్​ అందుకుంది. ​

ఇదీ చూడండి: సినిమాలు వదిలేసి సేద్యం చేద్దామనుకున్నా!

Last Updated : Feb 2, 2021, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.