ETV Bharat / sitara

మహేశ్​తో సినిమాపై సందీప్ వంగా క్లారిటీ!

author img

By

Published : Aug 11, 2021, 10:18 AM IST

సందీప్​ రెడ్డి దర్శకత్వంలో మహేశ్​ బాబు కథానాయకునిగా సినిమా రానుందా? అంటే అవుననే చెప్పాలి. సూపర్ స్టార్​తో సినిమా తీయనున్నట్లు సందీప్​ రెడ్డి వెల్లడించారు.

mahesh babu new movi
మహేశ్​ బాబు కొత్త సినిమా

'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్​లో తీరిక లేకుండా గడుపుతున్నారు సూపర్​ స్టార్ మహేశ్​ బాబు. ఈ మూవీ సెట్స్​పై ఉండగానే.. మహేశ్​తో ప్రాజెక్టు ఒప్పందానికి డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. త్రివిక్రమ్​ దర్శకత్వంలో మహేశ్​ 28వ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుందని ప్రకటన వచ్చేసింది. తాజాగా.. ప్రిన్స్​తో సినిమాపై డైరెక్టర్​ సందీప్ రెడ్డి వంగ కూడా క్లారిటీ ఇచ్చారు. సూపర్​ స్టార్​తో తప్పకుండా మూవీ ఉంటుందని.. ఇప్పటికే స్టోరీ లైన్ కూడా వివరించినట్లు తెలిపారు.

సందీప్​ రెడ్డి- మహేశ్ బాబు కాంబినేషన్​లో సినిమా రానుందని గతంలోనే ఊహాగానాలు వచ్చినా.. అవి కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం సమయం ఆసన్నమైందని సందీప్​ రెడ్డి చెప్పారు. ఓ కొత్త సబ్జెక్ట్​తో సూపర్ స్టార్​ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తానని వెల్లడించారు. తాను వివరించిన కథపై మహేశ్​ సానుకూలంగానే ఉన్నారని తెలిపారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్​లో సినిమా ఏ రేంజ్​లో ఉంటుందోనని అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఇదీ చదవండి:'అల్లు అర్జున్​ నా క్రష్.. ఆ వార్తలు చూసి నవ్వుకుంటా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.