ETV Bharat / sitara

Mahesh Babu: ఆరు నెలల్లో మహేశ్​బాబు రెండు సినిమాలు! - మహేశ్ త్రివిక్రమ్ మూవీ

ఇది నిజంగా మహేశ్​ అభిమానులకు పండగలాంటి వార్తే! ప్రస్తుతం అతడు చేస్తున్న 'సర్కారు వారి పాట', త్రివిక్రమ్​తో చేయబోయే సినిమాను.. కేవలం ఆరు నెలల వ్యవధిలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Mahesh Babu To Have Two Releases In Six Months?
మహేశ్ త్రివిక్రమ్
author img

By

Published : Jun 5, 2021, 4:20 PM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు(Mahesh babu).. ఆరు నెలల్లో తన రెండు సినిమాలను థియేటర్లలోకి తీసుకొచ్చేలా కనిపిస్తున్నారు. ప్రస్తుతం 'సర్కారు వారి పాట'తో(sarkaru vaari paata) బిజీగా ఉన్న ప్రిన్స్.. చిత్రబృందానికి త్వరలో వ్యాక్సిన్ వేయించనున్నారు. ఇది పూర్తయిన తర్వాత జులై నుంచి షూటింగ్​లో తిరిగి పాల్గొంటారు. అక్టోబరులో కల్లా దానిని ముగించి, త్రివిక్రమ్​తో కలిసి పనిచేస్తారు.

త్రివిక్రమ్-మహేశ్​ కాంబినేషన్​ అంటే సినీ అభిమానుల్లో ఎనలేని ఆసక్తి. వారిద్దరూ ఇంతకు ముందు చేసిన అతడు(Athadu), ఖలేజా(Khaleja) చిత్రాలు థియేటర్లలో సరిగా ఆడకపోయినప్పటికీ.. ఆ తర్వాత అభిమానుల దృష్టిలో కల్ట్ క్లాసిక్స్​గా నిలిచిపోయాయి. మరి ఇప్పుడు రాబోతున్న చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

అక్టోబరు కల్లా 'సర్కారు వారి పాట' షూటింగ్ పూర్తయితే, ముందే ప్రకటించినట్లు వచ్చే సంక్రాంతికి సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తారు. అలానే త్రివిక్రమ్(Trivikram)​ చిత్రాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి, వచ్చే సంవత్సరం వేసవిలో ప్రేక్షకులకు అందిచాలని మహేశ్ భావిస్తున్నారు. ఇదే గనుక అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. ఆరు నెలలో మహేశ్​ సినిమాలు రెండింటిని అభిమానులు చూడనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.