ETV Bharat / sitara

ఆ ముగ్గురితో విహారయాత్రకు వెళ్తా: మహేశ్ - ఆంగ్లమీడియాకు మహేశ్ ఇంటర్వ్యూ

మహేశ్​బాబు ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ప్రిన్స్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

Mahesh Babu
Mahesh Babu
author img

By

Published : Feb 18, 2020, 2:47 PM IST

Updated : Mar 1, 2020, 5:41 PM IST

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేశ్‌ బాబు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ప్రిన్స్ కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తున్నాడు. కొన్ని రోజుల విరామం అనంతరం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో నటిస్తాడు. తాజాగా ఈ హీరో ఓ ఆంగ్ల పత్రికకు చిన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ వీడియోను నమ్రత అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు మహేశ్‌ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు.

మహేశ్‌బాబు గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే..

మహేశ్‌బాబు: అణకువ.. వినయం.. విధేయత

మీ కెరీర్‌లో లేదా సినిమా సెట్‌లో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన

మహేశ్‌బాబు: సినిమాలో, సెట్‌లో అలాంటివి ఏవీ లేవు. అప్పట్లో ప్రతి సినిమా విడుదలైన తర్వాత సుదర్శన్‌ 35లో నాన్నతో కలిసి చూసేవాడిని. ‘మురారి’ సినిమా చూసిన తర్వాత నాన్న నా భుజంపై చేయి వేసి తట్టారు. ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.

Mahesh Babu
కృష్ణ, మహేశ్

మీ ఉద్దేశంలో పర్‌ఫెక్ట్ రొమాంటిక్‌ డేట్‌?

మహేశ్‌బాబు: నా భార్యతో కలిసి మంచి సినిమా చూడటం.

మిమ్మల్ని చికాకు పెట్టేది ఏంటి?

మహేశ్‌బాబు: నీతి, నిజాయతీలేని వ్యక్తులు

యువ మహేశ్‌బాబు గురించి మూడు ముక్కల్లో చెప్పమంటే..

మహేశ్‌బాబు: మా అబ్బాయి. తండ్రిలా ఉండమని చెబుతా.

మీ జీవిత కథతో బయోపిక్‌ తీస్తే, దానికి ఏం పేరు పెడతారు. ఎవరు మీ పాత్రను పోషిస్తే బాగుంటుంది.

మహేశ్‌బాబు: నాది చాలా చిన్న జీవితం.. పైగా బోరింగ్‌. నాపై బయోపిక్‌ పెద్ద వర్కవుట్‌ అవుతుందని నేను అనుకోవడం లేదు.

మీ దృష్టిలో మంచి విహారయాత్ర అంటే?

మహేశ్‌బాబు: నా పిల్లలు, భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లడం చాలా బాగుంటుంది.

Mahesh Babu
కుటుంబంతో మహేశ్

మీ ఫ్యాన్స్‌లో ఎవరైనా మీకోసం క్రేజీగా చేశారా?

మహేశ్‌బాబు: నా కెరీర్‌ ప్రారంభించిన కొత్తలో వేలల్లో మెయిల్స్‌, లెటర్స్‌ వచ్చేవి. అందులో ఒక లెటర్‌ రక్తంతో రాశారు. అది ఎప్పటికీ మర్చిపోలేను. నిజంగా క్రేజీగా అనిపించింది.

మీరు ఒక రోజు సీఎం అయితే, మొదటిగా చేసే పని ఏంటి?

మహేశ్‌బాబు: నాకూ తెలియదు. దేవుడే రాష్ట్రాన్ని రక్షించాలి.

ముగ్గురు నటులతో కలిసి రోడ్‌ ట్రిప్‌ వెళ్లమంటే ఎవరితో వెళ్తారు?

మహేశ్‌బాబు: చరణ్‌, తారక్‌, అందరినీ సమన్వయం చేయడానికి చిరంజీవి గారు.

Mahesh Babu
చరణ్, తారక్, మహేశ్

Last Updated : Mar 1, 2020, 5:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.