భూమికి అధిక స్థాయిలో ప్రాణవాయువును అందించే అమెజాన్ అడవులు... ఇటీవల కాలంలో తరచుగా అగ్నిప్రమాదాలకు గురవుతున్నాయి. బ్రెజిల్‌లో ఉన్న ఈ వన్య ప్రాంతం ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో దగ్ధం అవుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపు 85 శాతం ఎక్కువగా మంటలకు ఆహుతైందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వెల్లడించింది. పర్యావరణ వేత్తలు, శాస్త్రవేత్తలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఈ విషయంపై స్పందిస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొని అమెజాన్‌ని కాపాడుకుందామని పిలుపునిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ నెటిజన్లకు సోషల్‌మీడియా వేదికగా సందేశాన్నిచ్చారు.
"20 శాతం ఆక్సిజన్ అందించే అమెజాన్ అడవులు మంటల్లో కాలిపోతున్నాయి. ఈ వార్త చాలా బాధాకరం. ఇప్పటికైనా మేల్కొని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌ని కాపాడుకుందాం. జీవ వైవిధ్యం చాలా దెబ్బతింటోంది. మన భూమిని రక్షించుకోవడానికి మన వంతు కృషి చేద్దాం. పచ్చని వాతావరణం కోసం ఒక అడుగు ముందుకు వేయండి. దీనిని మన ఇంటి నుంచి ప్రారంభిద్దాం".
- మహేశ్‌బాబు, సినీ నటుడు
-
Deeply disturbing news... the #AmazonRainforest, rightfully called the 'lungs of our planet'... contributing to 20% of the world's oxygen is on fire!!! This is a wake-up call for all of us who are taking our planet for granted... #PrayfortheAmazon pic.twitter.com/FNbSJnyNvJ
— Mahesh Babu (@urstrulyMahesh) August 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Deeply disturbing news... the #AmazonRainforest, rightfully called the 'lungs of our planet'... contributing to 20% of the world's oxygen is on fire!!! This is a wake-up call for all of us who are taking our planet for granted... #PrayfortheAmazon pic.twitter.com/FNbSJnyNvJ
— Mahesh Babu (@urstrulyMahesh) August 22, 2019Deeply disturbing news... the #AmazonRainforest, rightfully called the 'lungs of our planet'... contributing to 20% of the world's oxygen is on fire!!! This is a wake-up call for all of us who are taking our planet for granted... #PrayfortheAmazon pic.twitter.com/FNbSJnyNvJ
— Mahesh Babu (@urstrulyMahesh) August 22, 2019
ప్రపంచంలోని అతిపెద్ద అడవులు, మనకు 20 శాతం ఆక్సిజన్ అందించే అడవులు, పది లక్షల మంది ప్రజలకు, లక్షలాది వన్యప్రాణులకు ఆధారమైన అడవులు కాలిపోతున్నాయి. దీని వల్ల వాతావరణంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ఈ ఘటన నా హృదయాన్ని ఎంతో బాధిస్తోంది.
-అల్లు అర్జున్, హీరో
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"భూమికి ఊపిరితిత్తుల్లా ఉన్న అమెజాన్ అడవి తగలబడిపోతుండటం చాలా బాధాకరం. నిజంగా ఇది ఊపిరిపీల్చుకోనివ్వని సంగతి. వన్య ప్రాంతం తగలబడిపోతుంటే ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాం. ఒక ట్వీట్ చేయడం, ఇన్‌స్టా పోస్టు పెట్టడం, మంటలు తగ్గాలని కోరుకోవడం తప్ప ఏం చేయలేకపోతున్నాం. కానీ చెట్లు నాటి భూమిని రక్షించుకునే అవకాశం ఇంకా మన చేతుల్లోనే ఉంది".
-సాయి ధరమ్ తేజ్, సినీ నటుడు
-
It’s been really suffocating to see that our lungs of the planet #AmazonForest are on fire and we’re not able to do anything and the only thing we can do is tweet or put up an Instagram post...hope the fire subsides and hope we can make it up for our planet by planting trees 🙏🏼🙏🏼 pic.twitter.com/5aNvjVEbDw
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">It’s been really suffocating to see that our lungs of the planet #AmazonForest are on fire and we’re not able to do anything and the only thing we can do is tweet or put up an Instagram post...hope the fire subsides and hope we can make it up for our planet by planting trees 🙏🏼🙏🏼 pic.twitter.com/5aNvjVEbDw
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 23, 2019It’s been really suffocating to see that our lungs of the planet #AmazonForest are on fire and we’re not able to do anything and the only thing we can do is tweet or put up an Instagram post...hope the fire subsides and hope we can make it up for our planet by planting trees 🙏🏼🙏🏼 pic.twitter.com/5aNvjVEbDw
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 23, 2019
బాలీవుడ్ నటీనటులు అక్షయ్ కుమార్, ఆలియా భట్, అనుష్క శర్మ, అర్జున్ కపూర్, దిశా పటానీతో పాటు పలువురు ప్రముఖులు మొక్కలు నాటి భూమిని కాపాడుకుందామని సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లను కోరుతున్నారు.
ఇవీ చూడండి.. 'రాజ్‌తరుణ్ తాగాడా లేదా అన్నది ఇప్పుడు తెలియదు'