సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు ఆయన కుమార్తె సితారతో ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇద్దరూ ఎప్పుడు చూసినా మంచి స్నేహితుల్లా కనిపిస్తుంటారు. నేడు మహేశ్ గారాల పట్టి సితార పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్తెపై భావోద్వేగంతో నిండిన ప్రేమతో శుభాకాంక్షలు చెబుతూ.. ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. "నీకు అప్పుడే 8 ఏళ్లు నిండిపోయాయి చిట్టితల్లి. నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తుంటా. పుట్టిన రోజు శుభాకాంక్షలు కన్నా" అని సూపర్ స్టార్ రాసుకొచ్చాడు.
-
So fast so 8 ♥️♥️♥️ I love you like you will never know 😍😍😍 Wishing you a very happy birthday ♥️♥️♥️♥️ #SituPapaTurns8 pic.twitter.com/8zWmgoMSfC
— Mahesh Babu (@urstrulyMahesh) July 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">So fast so 8 ♥️♥️♥️ I love you like you will never know 😍😍😍 Wishing you a very happy birthday ♥️♥️♥️♥️ #SituPapaTurns8 pic.twitter.com/8zWmgoMSfC
— Mahesh Babu (@urstrulyMahesh) July 19, 2020So fast so 8 ♥️♥️♥️ I love you like you will never know 😍😍😍 Wishing you a very happy birthday ♥️♥️♥️♥️ #SituPapaTurns8 pic.twitter.com/8zWmgoMSfC
— Mahesh Babu (@urstrulyMahesh) July 19, 2020
ఈ క్రమంలోనే సితార జీవితంలోని కొన్ని మధుర స్మృతులకు సంబంధించిన చిన్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు మహేశ్. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సితారకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.